హెచ్‌సీఏ కేసులపై లోకాయుక్త డెడ్‌లైన్
ABN , Publish Date - Jun 20 , 2026 | 01:43 AM
హైదరాబాద్ క్రికెట్ సంఘంపై తెలంగాణ క్రికెట్ సంఘం చేసిన ఫిర్యాదులపై నాలుగు వారాల్లో దర్యా ప్తు పూర్తి చేయాలని...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్ క్రికెట్ సంఘంపై తెలంగాణ క్రికెట్ సంఘం చేసిన ఫిర్యాదులపై నాలుగు వారాల్లో దర్యా ప్తు పూర్తి చేయాలని సీఐడీని తెలంగాణ లోకాయుక్త ఆదేశించింది. హెచ్‌సీఏ కేసుల దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై టీసీఏ కార్యదర్శి గురువారెడ్డి శుక్రవారం లోకాయుక్తను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ రాజశేఖర్‌రెడ్డిపై ఆదేశాలిచ్చారు. ఇక, టీజీ20 లీగ్‌ను నిర్వహించేందుకు హెచ్‌సీఏ ఏర్పాటు చేసిన ప్రస్తుత పాలకవర్గానికి అధికారం లేదని టీసీఏ క్రికెటర్లు గౌరవ్ శర్మ, మహేందర్ రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవం.. పార్టీ జెండా ఆవిష్కరించిన పవన్
హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ అలర్ట్.. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రయల్ రన్