బిష్ణోయ్ గ్యాంగ్ చేతుల్లో కెనడా క్రికెట్!
ABN , Publish Date - Apr 22 , 2026 | 02:52 AM
టీ20 వరల్డ్‌క్‌పలో కెనడా జట్టు ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై ఐసీసీ విచారణ చేస్తోంది. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలు...
న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌క్‌పలో కెనడా జట్టు ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై ఐసీసీ విచారణ చేస్తోంది. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ ఫిక్సింగ్ రాకెట్‌ను కరుడుగట్టిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నడిపిస్తున్నట్టు సమాచారం. పొట్టిక్‌పలో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా ప్రదర్శన అనుమానాలు రేకెత్తించింది. దీంతో బజ్వాను విచారించిన అవినీతి నిరోధక విభాగం.. అతడి మొబైల్‌ను కూడా తనిఖీ చేసింది. కాగా, దిల్‌ప్రీత్‌ను కెనడా జట్టు కెప్టెన్‌గా నియమించడం వెనుక బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉందని కెనడా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (సీబీసీ) ఓ కథనాన్ని వెలువరించింది.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టీమిండియా మహిళల స్థానాలివే!
కండరాల గాయం.. ఐపీఎల్ నుంచి ఆయుశ్ మాత్రే ఔట్