3 ఓవర్లు.. 9 వికెట్లు
ABN , Publish Date - Apr 10 , 2026 | 01:55 AM
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో బ్రెజిల్ మహిళా పేసర్ 21 ఏళ్ల లారా కర్డోసో అత్యంత అరుదైన రికార్డును నమోదు చేసింది...
బ్రెజిల్ మహిళా క్రికెటర్ కర్డోసో రికార్డు
గార్బోరోన్ (బోట్స్‌వానా): అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో బ్రెజిల్ మహిళా పేసర్ 21 ఏళ్ల లారా కర్డోసో అత్యంత అరుదైన రికార్డును నమోదు చేసింది. పురుషుల, మహిళల క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో 9 వికెట్లు పడగొట్టిన ఏకైక బౌలర్‌గా చరిత్రకెక్కింది. బీసీఏ కలహరి మహిళా టీ20 టోర్నీలో భాగంగా లెసోతో జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆమె 3-2-4-9 గణాంకాలు నమోదు చేయడం విశేషం. అలాగే ఇందులో ఓ హ్యాట్రిక్ కూడా ఉంది. ఇప్పటిదాకా టీ20 క్రికెట్‌లో సోనమ్ యెషే (8 వికెట్లు, భూటాన్) పేరిట కొనసాగిన ఈ రికార్డు బద్దలైంది. 203 పరుగుల భారీ ఛేదన కోసం బరిలోకి దిగిన లెసోతో టీమ్ లారా జోరుకు కేవలం 6.2 ఓవర్లలో 13 పరుగులకే కుప్పకూలింది.
ఇవి కూడా చదవండి:
ఎంఐపై హాఫ్ సెంచరీ మిస్.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ
ఎంఐ-ఆర్ఆర్: మా ఓటమికి బౌలర్లే ప్రధాన కారణం.. హార్దిక్ పాండ్య