Share News

ఐపీఎల్‌లో ‘బ్లాక్‌ మ్యాజిక్‌’ నిజమే!

ABN , Publish Date - Apr 22 , 2026 | 02:49 AM

ఐపీఎల్‌లో ‘బ్లాక్‌ మ్యాజిక్‌’ కలకలం రేపుతోంది. సన్‌రైజర్స్‌-చెన్నై మధ్య మ్యాచ్‌లో ఓ అభిమాని నిమ్మకాయతో ఏదో మంత్రాలు చదివి...

ఐపీఎల్‌లో ‘బ్లాక్‌ మ్యాజిక్‌’ నిజమే!

లలిత్‌ మోదీ సంచలన పోస్ట్‌

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో ‘బ్లాక్‌ మ్యాజిక్‌’ కలకలం రేపుతోంది. సన్‌రైజర్స్‌-చెన్నై మధ్య మ్యాచ్‌లో ఓ అభిమాని నిమ్మకాయతో ఏదో మంత్రాలు చదివి అటుగా చూపడం.. వెంటనే బ్యాటింగ్‌ చేస్తున్న శివం దూబే బౌల్డ్‌ అయిన వీడియో అందరినీ అవాక్కయ్యేలా చేసింది. దీనిపై చెన్నై ఫ్రాంచైజీ ఫిర్యాదు చేసినట్టు ఓ నకిలీ లేఖ కూడా నెట్‌లో చక్కర్లు కొట్టింది. అయితే, 2011లో ఇలాంటి ఘటన నిజంగానే జరిగిందని ఐపీఎల్‌ మాజీ చైర్మన్‌ లలిత్‌ మోదీ సంచలన విషయం బయటపెట్టాడు. ఓ ఫ్రాంచైజీ ఓనర్‌.. ప్రత్యర్థి టీమ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో క్షుద్రపూజలు చేసినట్టు ఎక్స్‌లో తెలిపాడు. ‘ఓ టీమ్‌ యజమాని బ్లాక్‌ మ్యాజిక్‌ చేస్తున్నట్టు మిగతా జట్లకు సమాచారం అందించా. 2011లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయ’ని లలిత్‌ తెలిపాడు.

ఇవి కూడా చదవండి:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టీమిండియా మహిళల స్థానాలివే!

కండరాల గాయం.. ఐపీఎల్ నుంచి ఆయుశ్ మాత్రే ఔట్

Updated Date - Apr 22 , 2026 | 02:49 AM