మిట్టల్ చేతికి రాజస్థాన్ రాయల్స్
ABN , Publish Date - May 04 , 2026 | 02:30 AM
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో అపర కుబేరుడు భాగస్వామ్యం కానున్నాడు. బ్రిటన్‌కు చెందిన ప్రవాస భారతీయుడు లక్ష్మీ మిట్టల్ కుటుంబం...
రూ.15,600 కోట్లతో డీల్
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో అపర కుబేరుడు భాగస్వామ్యం కానున్నాడు. బ్రిటన్‌కు చెందిన ప్రవాస భారతీయుడు లక్ష్మీ మిట్టల్ కుటుంబం రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని దక్కించుకుంది. ఈ ఏడాది మార్చిలో ఈ జట్టు కొనుగోలు కోసం కల్ సోమానీ గ్రూప్ రూ.15,300 కోట్లతో బిడ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నిధులు సమీకరించుకోవడంలో విఫలమైన సోమానీ గ్రూప్ పోటీ నుంచి వైదొలగింది. దీంతో తాజాగా లక్ష్మీ మిట్టల్ అతడి కుమారుడు ఆదిత్య మిట్టల్, అదార్ పూనావాలాలతో కూడిన గ్రూప్ రూ.15,660 కోట్ల అత్యధిక ధరతో బిడ్ వేసింది. తాజా ఒప్పందంలో మిట్టల్ ఫ్యామిలీకి 75 శాతం, పూనావాలాకు 18శాతం, మనోజ్ బదాలేకు 7శాతం వాటాలు ఉంటాయి. అలాగే పార్ల్ రాయల్స్, బార్బడోస్ రాయల్స్ జట్ల యాజమాన్య హక్కులు కూడా ఈ డీల్‌లో భాగం కానున్నాయి.
ఇవి కూడా చదవండి..
200 సీట్లలో గెలుస్తాం.. విజయ్ టీవీకే ధీమా
అస్సాంలో హోటల్ పాలిటిక్స్ సంకేతాలు.. రంగంలోకి కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ మేకర్ డీకే