Share News

విండీస్‌తో వన్డే సిరీస్‌కు వైస్‌ కెప్టెన్‌గా రాహుల్‌!

ABN , Publish Date - Sep 14 , 2026 | 03:38 AM

వెస్టిండీస్‌తో ఈనెల 27 నుంచి జరుగబోయే మూడు వన్డేల సిరీస్‌ కోసం మరో రెండు రోజుల్లో భారత జట్టును ప్రకటించనున్నారు...

విండీస్‌తో వన్డే సిరీస్‌కు వైస్‌ కెప్టెన్‌గా రాహుల్‌!

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో ఈనెల 27 నుంచి జరుగబోయే మూడు వన్డేల సిరీస్‌ కోసం మరో రెండు రోజుల్లో భారత జట్టును ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌కు డిప్యూటీగా కేఎల్‌ రాహుల్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సిరీస్‌ సమయంలోనే రెగ్యులర్‌ వైస్‌ కెప్టెన్‌ శ్రేయాస్‌ ఆసియా క్రీడల్లో టీ20 జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు. అలాగే వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ కూడా ఆసియాడ్‌ టీ20 జట్టులో ఉండడంతో విండీస్‌తో వన్డేల కోసం రిషభ్‌ పంత్‌, ధ్రువ్‌ జురెల్‌లలో ఒకరిని రిజర్వ్‌ కీపర్‌గా ఎంపిక చేయవచ్చు. మరోవైపు చీఫ్‌ సెలెక్టర్‌ అగార్కర్‌ పదవీకాలం వచ్చేనెల 4న ముగియనుండడంతో విండీస్‌ సిరీసే అతనికి చివరి ఎంపిక కానుంది. అగార్కర్‌ బాధ్యతల పొడిగింపుపై బోర్డు ఇప్పటిదాకా స్పందించలేదు.

ఇవి కూడా చదవండి:

పురుషుల జూనియర్ హాకీ ఆసియా కప్: వరుసగా నాలుగోసారి.. విజేతగా భారత్‌

ఆసియా కప్ జూనియర్ హాకీ: భారత మహిళల హ్యాట్రిక్ విజయం

Updated Date - Sep 14 , 2026 | 03:38 AM