Share News

వర్షార్పణం

ABN , Publish Date - Apr 07 , 2026 | 03:02 AM

ఐపీఎల్‌ తాజా సీజన్‌లో తొలిసారిగా వరుణుడు ఆధిపత్యం చూపాడు. సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌-పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా...

వర్షార్పణం

నేటి మ్యాచ్‌

రాజస్థాన్‌ X ముంబై

వేదిక గువాహటి రా.7.30 నుంచి

  • కోల్‌కతా-పంజాబ్‌ మ్యాచ్‌ రద్దు

  • ఇరు జట్లకు చెరో పాయింట్‌

కోల్‌కతా: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో తొలిసారిగా వరుణుడు ఆధిపత్యం చూపాడు. సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌-పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ను కేటాయించారు. ప్రస్తుతం పంజాబ్‌ ఐదు పాయింట్లతో టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతోంది. అంతకుముందు టాస్‌ గెలిచిన కోల్‌కతా బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే పంజాబ్‌ పేసర్‌ బార్ట్‌లెట్‌ (2/9) ధాటికి 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ ఆలెన్‌ (6), గ్రీన్‌ (4)లను బార్ట్‌లెట్‌ పెవిలియన్‌ చేర్చాడు. ఇక కేకేఆర్‌ 3.4 ఓవర్లలో 25/2 స్కోరుతో ఉన్నప్పుడు మ్యాచ్‌ను భారీవర్షం ఆటంకపరిచింది. వెంటనే ఆటగాళ్లంతా పెవిలియన్‌ చేరగా.. సిబ్బంది ఈడెన్‌ మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచారు. దాదాపు మూడు గంటల తర్వాత రాత్రి 10.30కి వరుణుడు తెరిపినిచ్చాడు. కానీ మైదానంలో అక్కడక్కడా నీటి గుంటలు ఏర్పడడంతో ఐదు ఓవర్ల మ్యాచ్‌ కూడా వీలు కాలేదు. దీంతో ఇరు జట్ల కెప్టెన్లతో చర్చించిన అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.


స్కోరుబోర్డు

కోల్‌కతా: రహానె (నాటౌట్‌) 8, ఆలెన్‌ (సి) ప్రభ్‌సిమ్రన్‌ (బి) బార్ట్‌లెట్‌ 6, గ్రీన్‌ (సి) ప్రభ్‌సిమ్రన్‌ (బి) బార్ట్‌లెట్‌ 4, రఘువంశీ (నాటౌట్‌) 7; మొత్తం: 3.4 ఓవర్లలో 25/2. వికెట్ల పతనం: 1-12, 2-16. బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 2-0-16-0, బార్ట్‌లెట్‌ 1.4-0-9-2.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

పంజాబ్‌ 3 2 0 1 5 0.637

బెంగళూరు 2 2 0 0 4 2.501

రాజస్థాన్‌ 2 2 0 0 4 2.233

ఢిల్లీ 2 2 0 0 4 1.170

హైదరాబాద్‌ 3 1 2 0 2 0.275

ముంబై 2 1 1 0 2 -0.206

లఖ్‌నవూ 2 1 1 0 2 -0.542

కోల్‌కతా 3 0 2 1 1 -1.964

గుజరాత్‌ 2 0 2 0 0 -0.424

చెన్నై 3 0 3 0 0 -2.517

ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి; ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు

ఇవి కూడా చదవండి:

అందుకే ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించా.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

ధోనికి ఫిట్‌నెస్ టెస్ట్.. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌తో బరిలోకి దిగనున్న తలా!

Updated Date - Apr 07 , 2026 | 03:02 AM