Share News

కోల్‌కతాకు ఓ గెలుపు

ABN , Publish Date - Apr 20 , 2026 | 01:37 AM

మాజీ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) ఎట్టకేలకు ఈ ఐపీఎల్‌లో బోణీ చేసింది. క్లిష్టపరిస్థితుల్లో రింకూ సింగ్‌ (34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్‌), అనుకూల్‌ రాయ్‌...

కోల్‌కతాకు  ఓ గెలుపు

  • 4 వికెట్లతో రాజస్థాన్‌ ఓటమి

  • సత్తా చాటిన రింకూ, అనుకూల్‌

  • వరుణ్‌కు 3 వికెట్లు

కోల్‌కతా: మాజీ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) ఎట్టకేలకు ఈ ఐపీఎల్‌లో బోణీ చేసింది. క్లిష్టపరిస్థితుల్లో రింకూ సింగ్‌ (34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్‌), అనుకూల్‌ రాయ్‌ (16 బంతుల్లో ఓ ఫోర్‌, 2 సిక్స్‌లతో 29 నాటౌట్‌) దీటుగా పోరాడడంతో.. ఆదివారం ఉత్కంఠగా సాగిన లోస్కోరింగ్‌ మ్యాచ్‌లో కోల్‌కతా 4 వికెట్లతో రాజస్థాన్‌ రాయల్స్‌పై గెలిచింది. తొలుత రాజస్థాన్‌ 20 ఓవర్లలో 155/9 స్కోరు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వరుణ్‌ చక్రవర్తి, కార్తీక్‌ త్యాగి చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (39), వైభవ్‌ సూర్యవంశీ (46) తొలి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యంతో అదిరే ఆరంభాన్నిచ్చారు. కానీ, మిడిల్‌ ఓవర్లలో స్పిన్నర్లు వరుణ్‌, నరైన్‌ క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ రాజస్థాన్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. జురెల్‌ (5), కెప్టెన్‌ పరాగ్‌ (12), హెట్‌మయెర్‌ (15), ఫెరీరా (7), జడేజా (9) నిరాశపరిచారు. ఛేదనలో కోల్‌కతా 19.4 ఓవర్లలో 161/6 స్కోరు చేసి నెగ్గింది. జడేజా 2 వికెట్లు తీశాడు. స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన నైట్‌రైడర్స్‌ ఘోరంగా తడబడింది. ఇన్నింగ్స్‌ తొలి బంతికే ఓపెనర్‌ సీఫెర్ట్‌ (0)ను ఆర్చర్‌ డకౌట్‌ చేయగా.. మరో ఓపెనర్‌, కెప్టెన్‌ రహానె (0)ను బర్గర్‌ పెవిలియన్‌ చేర్చాడు. గ్రీన్‌ (27), రఘువంశీ (10), పోవెల్‌ (23), రమణ్‌దీప్‌ (10) స్వల్ప స్కోర్లకే వెనుదిరగడంతో కోల్‌కతా 85/6తో పరాజయం అంచున నిలిచింది. ఈ దశలో రింకూ, అనుకూల్‌ ఏడో వికెట్‌కు అజేయంగా 76 రన్స్‌ జోడించడంతో.. ఈ సీజన్‌లో కోల్‌కతా తొలి గెలుపును నమోదు చేసింది.


స్కోరుబోర్డు

రాజస్థాన్‌: జైస్వాల్‌ (సి) రహానె (బి) నరైన్‌ 39, వైభవ్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) వరుణ్‌ 46, జురెల్‌ (స్టంప్డ్‌) సీఫెర్ట్‌ (బి) వరుణ్‌ 5, పరాగ్‌ (బి) వరుణ్‌ 12, హెట్‌మయెర్‌ (సి) రఘువంశీ (బి) త్యాగి 15, ఫెరీరా (సి అండ్‌ బి) నరైన్‌ 7, జడేజా (సి) గ్రీన్‌ (బి) త్యాగి 9, ఆర్చర్‌ (రనౌట్‌) 8, బిష్ణోయ్‌ (సి) సీఫెర్ట్‌ (బి) త్యాగి 0, బ్రిజేష్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 20 ఓవర్లలో 155/9; వికెట్ల పతనం: 1-81, 2-97, 3-99, 4-117, 5-124, 6-144, 7-146, 8-146, 9-155; బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 4-0-37-0, కార్తీక్‌ త్యాగి 4-0-22-3, గ్రీన్‌ 2-0-27-0, నరైన్‌ 4-0-26-2, వరుణ్‌ చక్రవర్తి 4-0-14-3, రమణ్‌దీప్‌ 2-0-26-0.

కోల్‌కతా: సీఫెర్ట్‌ (బి) ఆర్చర్‌ 0, రహానె (సి) జురెల్‌ (బి) బర్గర్‌ 0, రఘువంశీ (ఎల్బీ) జడేజా 10, గ్రీన్‌ (స్టంప్డ్‌) జురెల్‌ (బి) బిష్ణోయ్‌ 27, పోవెల్‌ (సి) ఫెరీరా (బి) జడేజా 23, రింకూ సింగ్‌ (నాటౌట్‌) 53, రమణ్‌దీప్‌ (బి) యశ్‌ రాజ్‌ 10, అనుకూల్‌ (నాటౌట్‌) 29; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 19.4 ఓవర్లలో 161/6; వికెట్ల పతనం: 1-0, 2-5, 3-37, 4-52, 5-70, 6-85; బౌలింగ్‌: ఆర్చర్‌ 4-0-35-1, బర్గర్‌ 2-0-20-1, రవి బిష్ణోయ్‌ 4-0-41-1, యశ్‌ రాజ్‌ 4-0-25-1, జడేజా 3-0-8-2, పరాగ్‌ 1-0-10-0, బ్రిజేష్‌ 1.4-0-21-0.

రాజస్థాన్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ అరుదైన ఘనతను అందుకొన్నాడు. ఇన్నింగ్స్‌ తొలి బంతికే సీఫెర్ట్‌ను ఆర్చర్‌ డకౌట్‌ చేశాడు. లీగ్‌లో ఇలా మొదటి బంతికే వికెట్‌ పడగొట్టడం అతడికి ఇది ఐదోసారి. ఈ జాబితాలో షమి రికార్డును ఆర్చర్‌ సమం చేశాడు.

ఈ వార్తలనూ చదవండి:

శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ

భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో

Updated Date - Apr 20 , 2026 | 01:42 AM