ఖలీల్ స్థానంలో కుల్దీప్
ABN , Publish Date - May 16 , 2026 | 02:42 AM
గాయపడిన పేసర్ ఖలీల్ అహ్మద్ స్థానం లో కుల్దీప్ యాదవ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంది. ఈ సీజన్‌లో...
న్యూఢిల్లీ: గాయపడిన పేసర్ ఖలీల్ అహ్మద్ స్థానం లో కుల్దీప్ యాదవ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంది. ఈ సీజన్‌లో సీఎ్‌సకేకు 5 మ్యాచ్‌లాడిన ఖలీల్ తొడ కండర గాయంతో లీగ్‌కు దూరమయ్యాడు. దేశవాళీ పోటీల్లో ఢిల్లీకి ఆడే 29 ఏళ్ల ఎడమచేతి వాటం పేసర్ కుల్దీప్ యాదవ్‌ను అతడి కనిష్ఠ ధర రూ. 30 లక్షలకు చెన్నై తీసుకుంది. ఇక శ్రీలంకకు చెందిన నువాన్ తుషారకు ఆ దేశ క్రికెట్ బోర్డు ‘నిరభ్యంతర పత్రం’ ఇవ్వకపోవడంతో భారత్ రాలేకపోయాడు. అతడికి బదులు ఇంగ్లండ్ పేసర్ రిచర్డ్ గ్లీసన్ (రూ. 1.60 కోట్లు)ను జట్టులో చేర్చుకుంది.
ఇవి కూడా చదవండి:
ప్లే ఆఫ్స్‌కు ముందు కేకేఆర్‌కు షాక్.. ఐపీఎల్‌ను వీడిన రచిన్ రవీంద్ర
కెప్టెన్‌గా సంజు టీమిండియాను ఉత్తమంగా నడిపించగలడు: రవి శాస్త్రి