ఢిల్లీ మెంటార్ పదవికి కెవిన్ గుడ్‌బై
ABN , Publish Date - Mar 15 , 2026 | 06:01 AM
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్ పదవి నుంచి వైదొలగుతున్నట్టు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ శనివారం వెల్లడించాడు...
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్ పదవి నుంచి వైదొలగుతున్నట్టు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ శనివారం వెల్లడించాడు. ఆ విధులకు తగినంత సమయం కేటాయించలేకపోవడమే తన నిర్ణయానికి కారణమని కెవిన్ వివరించాడు. 45 ఏళ్ల పీటర్సన్ గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే ఈ సీజన్ మెగా లీగ్‌లో తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నట్టు తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
పాక్ ఆటగాళ్లకు రూ.50లక్షల జరిమానా.. ఆ వార్తలను ఖండించిన పీసీబీ
పాకిస్థాన్ ప్లేయర్ ప్రపంచ రికార్డ్..