Share News

‘ఐపీఎల్‌ వల్లే నా కెరీర్‌ నాశనమైంది’

ABN , Publish Date - Apr 07 , 2026 | 02:49 AM

ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ ఐపీఎల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ మెగా లీగ్‌ వల్లే తన అంతర్జాతీయ కెరీర్‌ నాశనమైందన్నాడు. ఐపీఎల్‌ తొలి నాళ్లలో....

‘ఐపీఎల్‌ వల్లే నా కెరీర్‌ నాశనమైంది’

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ ఐపీఎల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ మెగా లీగ్‌ వల్లే తన అంతర్జాతీయ కెరీర్‌ నాశనమైందన్నాడు. ఐపీఎల్‌ తొలి నాళ్లలో..మీడియాను ఉపయోగించుకొని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) తనను వేధించిందని ఆరోపించాడు. ఐపీఎల్‌ మొదలైన 2008లో ఒకేఒక్క ఇంగ్లండ్‌ క్రికెటర్‌ డిమిత్రి మస్క్‌రెనాస్‌ మాత్రమే లీగ్‌లో ఆడాడు. కేంద్ర కాంట్రాక్టులో ఉన్న క్రికెటర్లు ఐపీఎల్‌లో పాల్గొనకుండా ఈసీబీ నిషేధించడమే అందుకు కారణం. 2009లో బ్రిటిష్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌ బరిలో దిగేందుకు ఈసీబీ అనుమతించినా..దాన్ని మూడు వారాలకే పరిమితం చేసింది. దాంతో కెవిన్‌ మెగా లీగ్‌కే తొలి ప్రాధాన్యమిచ్చాడు. ఫలితంగా ఈసీబీతో అతడికి అంతరం పెరిగింది. దరిమిలా పీటర్సన్‌ను జాతీయ జట్టుకు ఈసీబీ దూరం పెట్టింది. ‘నేను పెద్ద త్యాగాలు చేశా. నా కెరీర్‌ను వదులు కోవాల్సి వచ్చింది. అందుకే ఆ సంస్థలో అందరూ నాకు వ్యతిరేకమయ్యారు’ అని ఈసీబీనుద్దేశించి కెవిన్‌ అన్నాడు.

ఇవి కూడా చదవండి:

అందుకే ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించా.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

ధోనికి ఫిట్‌నెస్ టెస్ట్.. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌తో బరిలోకి దిగనున్న తలా!

Updated Date - Apr 07 , 2026 | 02:49 AM