జెమీమా రీఎంట్రీ
ABN , Publish Date - Nov 10 , 2026 | 05:41 AM
కండర గాయం నుంచి కోలుకొన్న బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ మళ్లీ భారత మహిళల జట్టులో చోటు దక్కించుకొంది. వచ్చే నెల దక్షిణాఫ్రికాలో...
దక్షిణాఫ్రికా టూర్‌కు భారత జట్ల ఎంపిక
న్యూఢిల్లీ: కండర గాయం నుంచి కోలుకొన్న బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ మళ్లీ భారత మహిళల జట్టులో చోటు దక్కించుకొంది. వచ్చే నెల దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత జట్లను సెలెక్టర్లు సోమవారం ప్రకటించారు. స్మృతి మంధాన సారథ్యం వహించనుండగా.. జెమీమా, మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్, స్పిన్నర్ శ్రీచరణికి మూడు ఫార్మాట్లలోనూ స్థానం లభించింది. పేసర్ అరుంధతి టీ20లకు ఎంపికైంది. ఈ పర్యటనలో దక్షిణాఫ్రికాతో భారత్ ఏకైక టెస్ట్, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. వచ్చే నెల 9 నుంచి ఏకైక టెస్ట్, 16 నుంచి 22 వరకు వన్డేలు, 26 నుంచి 30 వరకు టీ20ల సిరీస్‌ను జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి:
ఎంఐతో ట్రేడ్ డీల్.. పంజాబ్‌కు చిక్కులు తప్పవు: భారత మాజీ క్రికెటర్