Share News

జమ్మూ 527కు 6 వికెట్ల

ABN , Publish Date - Feb 26 , 2026 | 05:28 AM

బ్యాటర్లు అదరగొట్టడంతో.. కర్ణాటకతో రంజీ ఫైనల్లో జమ్మూ కశ్మీర్‌ మెరుగైన స్థితిలో నిలిచింది. ఆటకు రెండో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు..

జమ్మూ 527కు 6 వికెట్ల

కర్ణాటకతో రంజీ ఫైనల్‌

హుబ్బళ్లి (కర్ణాటక): బ్యాటర్లు అదరగొట్టడంతో.. కర్ణాటకతో రంజీ ఫైనల్లో జమ్మూ కశ్మీర్‌ మెరుగైన స్థితిలో నిలిచింది. ఆటకు రెండో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 284/2తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన జమ్మూ 6 వికెట్లకు 527 పరుగుల భారీ స్కోరు చేసింది. బుధవారం ఆట చివరికి సాహిల్‌ లోథ్రా (57), ముస్తాక్‌ (20) క్రీజులో ఉన్నారు. శుభమ్‌ (121) త్వరగానే పెవిలియన్‌ చేరినా.. తొలి రోజు రిటైర్డ్‌ హర్ట్‌ అయిన కెప్టెన్‌ పరాస్‌ డోగ్రా (70), వాద్వాన్‌ (70), అబ్దుల్‌ సమద్‌ (61) అర్ధ శతకాలు చేశారు. ప్రసిద్ధ్‌ కృష్ణ 3 వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి:

మ్యాచ్ మధ్యలో పక్షికి సీపీఆర్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్

టీ20 ప్రపంచ కప్: న్యూజిలాండ్ మెరుపులు.. శ్రీలంక టార్గెట్ 169

Updated Date - Feb 26 , 2026 | 05:28 AM