గెలుపు ముంగిట జమ్మూ కశ్మీర్
ABN , Publish Date - Feb 28 , 2026 | 02:40 AM
తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన జమ్మూ కశ్మీర్ టైటిల్ దిశగా సాగుతోంది. శుక్రవారం నాలుగో రోజు ఆటలో జమ్మూ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 186 పరుగులు చేసింది. కమ్రాన్ ఇక్బాల్ (94 బ్యాటింగ్)...
రెండో ఇన్నింగ్స్ 186/4
ప్రస్తుత ఆధిక్యం 477
కర్ణాటకతో రంజీ ఫైనల్
హుబ్బళ్లి: తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన జమ్మూ కశ్మీర్ టైటిల్ దిశగా సాగుతోంది. శుక్రవారం నాలుగో రోజు ఆటలో జమ్మూ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 186 పరుగులు చేసింది. కమ్రాన్ ఇక్బాల్ (94 బ్యాటింగ్), సాహిల్ లోత్రా (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం 477 పరుగుల భారీ ఆధిక్యంలో ఉండగా మ్యాచ్‌కు శనివారం ఆఖరి రోజు. దీంతో ఫైనల్ పోరు డ్రాగా ముగిసే అవకాశం ఉంది. అదే జరిగితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా జమ్మూ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించనుంది. అంతకుముందు కర్ణాటకను పేసర్ అకీబ్ నబీ ఐదు వికెట్లతో వణికించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 293 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ (160) శతకం సాధించగా, కృతిక్ (36) ఫర్వాలేదనిపించాడు. సునీల్, యుధ్‌వీర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. జమ్మూ తొలి ఇన్నింగ్స్‌లో 584 పరుగులు చేసింది. మరోవైపు ఈ సీజన్‌లో చెలరేగుతున్న జమ్మూ పేసర్ అకీబ్ నబీని ఇంగ్లండ్ పర్యటన కోసం భారత జట్టుకు ఎంపిక చేయాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోరాడు. 29 ఏళ్ల అకీబ్ ఈ రంజీ సీజన్‌లో ఇప్పటి వరకు 60 వికెట్లు పడగొట్టాడు.
ఈ వార్తలూ చదవండి
ఏఐ వల్లే 4 వేల మందిని తీసేస్తున్నాము: జాక్ డోర్సీ
కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ