Share News

ఇషాన్‌ మళ్లీ అదరగొట్టాడు

ABN , Publish Date - Sep 10 , 2026 | 05:15 AM

కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ (98 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 80) మరోసారి చెలరేగిన వేళ దులీప్‌ ట్రోఫీని ఈస్ట్‌జోన్‌ సొంతం చేసుకోవడం ఖాయమైంది. ఇషాన్‌తో పాటు వన్‌డౌన్‌ బ్యాటర్‌ శిఖర్‌ మోహన్‌ (52) అర్ధ శతకంతో..

ఇషాన్‌ మళ్లీ అదరగొట్టాడు

దులీప్‌ ట్రోఫీఫైనల్‌

  • రెండో ఇన్నింగ్స్‌ 212/5

  • సౌత్‌జోన్‌ తొలి ఇన్నింగ్స్‌ 336

చెన్నై: కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ (98 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 80) మరోసారి చెలరేగిన వేళ దులీప్‌ ట్రోఫీని ఈస్ట్‌జోన్‌ సొంతం చేసుకోవడం ఖాయమైంది. ఇషాన్‌తో పాటు వన్‌డౌన్‌ బ్యాటర్‌ శిఖర్‌ మోహన్‌ (52) అర్ధ శతకంతో రాణించడంతో సౌత్‌జోన్‌తో ఫైనల్లో..బుధవారం ఆఖరికి రెండో ఇన్నింగ్స్‌లో ఈస్ట్‌జోన్‌ ఐదు వికెట్లకు 212 పరుగులు చేసింది. కుమార కుశాగ్ర (34 బ్యాటింగ్‌), ఖురైషీ (26 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 372 పరుగులతో కలిపి..ఓవరాల్‌గా ఈస్ట్‌జోన్‌ 584 భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో కిషాన్‌, మోహన్‌ మూడో వికెట్‌కు 126 పరుగులు జోడించారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ 242/6 స్కోరుతో నాలుగో రోజు మొదటి ఇన్నింగ్స్‌ కొనసాగించిన సౌత్‌జోన్‌..336 పరుగులకు ఆలౌటైంది. కిందటి రోజు 56 రన్స్‌తో బ్యాటింగ్‌ చేస్తున్న కెప్టెన్‌ తిలక్‌ వర్మ ఒక్క పరుగులో శతకం కోల్పోయాడు. చామ మిలింద్‌ (43)తో కలిసి ఏడో వికెట్‌కు తిలక్‌ విలువైన 78 రన్స్‌ జత చేశాడు. 99 (211 బంతుల్లో 9 ఫోర్లతో) పరుగుల వద్ద స్పిన్నర్‌ ఖురైషీ బౌలింగ్‌లో అతడికే క్యాచ్‌ ఇచ్చి తిలక్‌ నిష్క్రమించాడు. ఈ ఇన్నింగ్స్‌తో టెస్ట్‌ల్లోనూ తాను సుదీర్ఘంగా ఆడగలనని హైదరాబాదీ నిరూపించాడు.

సంక్షిప్తస్కోర్లు

ఈస్ట్‌జోన్‌ తొలి ఇన్నింగ్స్‌: 708

సౌత్‌జోన్‌ తొలి ఇన్నింగ్స్‌: 336 (తిలక్‌ వర్మ 99, పడిక్కళ్‌ 62, మిలింద్‌ 43, శ్రేయాస్‌ గోపాల్‌ 26, ముకేష్‌ కుమార్‌ 3/62, షమి 2/42, శిఖర్‌ మోహన్‌ 2/67, ఖురైషీ 2/99)

ఈస్ట్‌జోన్‌ రెండో ఇన్నింగ్స్‌: 212/5 (ఇషాన్‌ కిషన్‌ 80, శిఖర్‌ మోహన్‌ 52, కుశాగ్ర బ్యాటింగ్‌ 34, ఖురైషీ బ్యాటింగ్‌ 26, నిధీష్‌ 1/14, సిరాజ్‌ 1/17, రషీద్‌ 1/20, విజయ్‌ త్రిపురాన 1/84).

ఇవి కూడా చదవండి..

ఎస్-400, ఎస్‌యు-57, బ్రహ్మోస్‌పై భారత్‌ ఫోకస్.. మోదీ-పుతిన్ భేటీలో కీలక చర్చలు..

మరో పదేళ్లలో మనుషుల్ని ఏఐ చంపేయొచ్చు.. ఆంత్రోపిక్‌ పరిశోధకుడి సంచలన హెచ్చరిక..

Updated Date - Sep 10 , 2026 | 05:15 AM