సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్
ABN , Publish Date - Mar 19 , 2026 | 05:20 AM
ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ తాత్కాలిక కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ నియమితుడయ్యాడు. వెన్నెముక గాయం నుంచి కోలుకొంటున్న...
కమిన్స్ గైర్హాజరీలో బాధ్యతలు
అభిషేక్‌కు వైస్ కెప్టెన్సీ
హైదరాబాద్: ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ తాత్కాలిక కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ నియమితుడయ్యాడు. వెన్నెముక గాయం నుంచి కోలుకొంటున్న రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అతడి గైర్హాజరీలో ఇషాన్ నాయకత్వం వహించనున్నట్టు సన్‌రైజర్స్ యాజమాన్యం ప్రకటించింది. మరో డాషింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఉప సారథిగా వ్యవహరించనున్నాడు. టీ20 వరల్డ్‌క్‌పలో అదరగొట్టిన ఇషాన్.. కెప్టెన్‌గా జార్ఖండ్‌కు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు.
ఇవి కూడా చదవండి..
జియో కీలక ప్రకటన.. రోమింగ్ ప్యాక్ లేకున్నా ఓటీపీలు
సూచీలకు వరుసగా మూడో రోజూ లాభాలే.. రూపాయి భారీ పతనం..