అభిషేక్‌ను దాటేసి.. నెం.1కు ఇషాన్
ABN , Publish Date - Jul 02 , 2026 | 05:27 AM
డ్యాషింగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానానికి చేరుకున్నాడు. బుధవారం విడుదలైన ర్యాంకింగ్స్‌లో సహచరుడు అభిషేక్ శర్మ (869)ను వెనక్కు నెట్టి...
టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్
దుబాయ్ : డ్యాషింగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానానికి చేరుకున్నాడు. బుధవారం విడుదలైన ర్యాంకింగ్స్‌లో సహచరుడు అభిషేక్ శర్మ (869)ను వెనక్కు నెట్టి ఇషాన్ (876) అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నాడు. దాదాపు ఏడాదిపాటు టాప్‌లో కొనసాగిన అభిషేక్ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. యువ బ్యాటర్ తిలక్ వర్మ (747) ఆరో స్థానాన్ని నిలబెట్టుకోగా, సూర్యకుమార్ యాదవ్ (708) ఒకస్థానం దిగజారి ఎనిమిదో ర్యాంక్ దక్కించుకున్నాడు. బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, బుమ్రా ఒక్కో ర్యాంక్ దిగజారి వరుసగా మూడు, ఆరు స్థానాలు సాధించారు. అఫ్ఘానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలర్లలో టాప్ ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు. టెస్ట్ బ్యాటర్లలో భారత్ కెప్టెన్ గిల్ ఒక స్థానం ఎగబాకి ఆరులో, యశస్వీ జైస్వాల్ ఒక ర్యాంక్ దిగజారి తొమ్మిదో స్థానంలో ఉన్నారు. బౌలర్లలో బుమ్రా టాప్‌లో నిలిచాడు.
ఇవి కూడా చదవండి:
ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్య కోసం ఏడు ఫ్రాంచైజీలు పోటీ!
శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేసిన కేరళ క్రికెట్ అసోసియేషన్