ఐర్లాండ్ రికార్డు స్కోరు
ABN , Publish Date - Feb 15 , 2026 | 05:14 AM
కెప్టెన్ లోర్కాన్ టకర్ (51 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 94 నాటౌట్) అజేయ అర్ధ శతకంతో చెలరేగడంతో.. ఈ టీ20 వరల్డ్‌క్‌పలో ఐర్లాండ్ రికార్డు స్కోరుతో అదరగొట్టింది. దీంతో గ్రూప్-బిలో...
ఒమన్‌పై భారీ గెలుపు
కొలంబో: కెప్టెన్ లోర్కాన్ టకర్ (51 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 94 నాటౌట్) అజేయ అర్ధ శతకంతో చెలరేగడంతో.. ఈ టీ20 వరల్డ్‌క్‌పలో ఐర్లాండ్ రికార్డు స్కోరుతో అదరగొట్టింది. దీంతో గ్రూప్-బిలో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ 96 పరుగులతో ఒమన్‌పై ఘన విజయం సాధించింది. తొలుత ఐర్లాండ్ 20 ఓవర్లలో 235/5తో భారీ స్కోరు చేసింది. ఈ టోర్నీలో ఓ జట్టుకిదే అత్యధిక స్కోరు కావడం విశేషం. గారెత్ డిలానె (56), జార్జ్ డాక్రెల్ (35 నాటౌట్) రాణించారు. షకీల్ అహ్మద్ 3 వికెట్లు తీశాడు. ఛేదనలో ఒమన్ 18 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. అమీర్ కలీమ్ (50), హమద్ మీర్జా (46) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. జోష్ లిటిల్ 3 వికెట్లు పడగొట్టగా.. మాథ్యూ హమ్‌ఫ్రేస్, బారీ మెకార్తీలకు చెరో 2 వికెట్లు దక్కాయి. కాగా, వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడిన ఒమన్ సూపర్-8 రేసు నుంచి అవుటైంది.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచకప్2026: 96 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం
భారత్-పాక్ మ్యాచ్: టీమిండియాకు ఒకే ఒక్క ఓటమి.. అదెప్పుడంటే?