సామాన్యులకు దూరంగా ఐపీఎల్
ABN , Publish Date - Apr 18 , 2026 | 02:42 AM
క్రికెట్‌పై తెలుగు ప్రజలకు ఉండే అభిమానాన్ని తమిళనాడుకు చెందిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) యాజమాన్యం బాగా సొమ్ము చేసుకుంటోంది...
ఉప్పల్ స్టేడియంలో ఽధోనీ సరదా
సీఎస్కే మ్యాచ్‌కు టిక్కెట్ ధరలు రెట్టింపు
టిక్కెట్లు క్షణాల్లో మాయమవడంపై ఫ్యాన్స్ ఆగ్రహం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): క్రికెట్‌పై తెలుగు ప్రజలకు ఉండే అభిమానాన్ని తమిళనాడుకు చెందిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) యాజమాన్యం బాగా సొమ్ము చేసుకుంటోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి తొలి రెండు మ్యాచ్‌లకు కొన్ని ఎంపిక చేసిన స్టాండ్స్‌లో రేట్లు పెంచిన ఎస్‌ఆర్‌హెచ్.. శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌కు వివిధ స్టాండ్స్‌లోని టిక్కెట్ల రేట్లను రెట్టింపు చేసింది. దీంతో సగటు క్రికెట్ అభిమాని టిక్కెట్ కొనుగోలు చేసి, మ్యాచ్‌ను చూడలేని స్థితికి ఐపీఎల్ చేరుకుందని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సౌత్ ఈస్ట్, వెస్ట్ టెర్రస్ టిక్కెట్లను రూ.1250 నుంచి రూ.2500కు పెంచేశారు. అలాగే రూ.2,250 ఉండే ఈస్ట్, వెస్ట్ ఫస్ట్ ఫ్లోర్ టిక్కెట్ ధరలను రూ.3500లకు, రూ.23 వేలుగా ఉన్న సౌత్ కార్పొరేట్ బాక్సు టిక్కెట్లను ఏకంగా రూ.33 వేలకు పెంచేశారు. వీటికి బుకింగ్ చార్జీలు రూ.300ల నుంచి రూ.2 వేల వరకు టిక్కెట్ శ్రేణిని బట్టి అదనం. సరే ఇవన్నీ పక్కకి పెట్టి ఏదో రకంగా ధోనీని చూడాలనో, మరో అభిమాన క్రికెటర్ ఆటని ప్రత్యక్షంగా తిలకించాలనో టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు యాప్ ఓపెన్ చేస్తే భారీ క్యూ లైన్ చూపించి, క్షణాల్లో టిక్కెట్లు అయిపోయాయని సోల్డ్ అవుట్ మెసేజ్‌లు దర్శనమిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు ఇతర జట్లన్నీ టిక్కెట్ల ధరలను తెలియజేస్తూ మ్యాచ్‌కు ముందు ఇచ్చే సమాచారం కూడా ఎస్‌ఆర్‌హెచ్ అందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కాంప్లిమెంటరీ పాస్ లు మినహాయించి, మిగిలిన టిక్కెట్లను యాప్‌లో అందుబాటులో ఉంచకుండా ఎస్‌ఆర్‌హెచ్ బ్లాక్ చేసి, సిఫార్సుల ఆధారంగా అమ్ముతున్నదని అభిమానులు మండిపడుతున్నారు. ఎస్‌ఆర్‌హెచ్‌కు చిత్తశుద్ధి ఉంటే విక్రయించిన టిక్కెట్ల సమాచారాన్ని బహిరంగంగా వెల్లడించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
డగౌట్‌లో ఫోన్ వాడకం.. ఆర్ఆర్ టీమ్ మేనేజర్‌కు జరిమానా విధించిన బీసీసీఐ
గుజరాత్‌పై వరుణ్ చక్రవర్తి విజృంభణ చూస్తాం: కార్తిక్ త్యాగి