Share News

ఫైనల్‌ అక్కడే ఎందుకంటే..

ABN , Publish Date - May 08 , 2026 | 02:18 AM

ఐసీసీ బోర్డు సమావేశం జరగనుండడం, స్టేడియం సామర్థ్యం ఎక్కువగా ఉండడంతోనే ఈసారి ఐపీఎల్‌ ఫైనల్‌ వేదికను బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కు తరలించినట్టు...

ఫైనల్‌ అక్కడే ఎందుకంటే..

ఐపీఎల్‌ చైర్మన్‌ అరుణ్‌ ధూమల్‌

న్యూఢిల్లీ: ఐసీసీ బోర్డు సమావేశం జరగనుండడం, స్టేడియం సామర్థ్యం ఎక్కువగా ఉండడంతోనే ఈసారి ఐపీఎల్‌ ఫైనల్‌ వేదికను బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కు తరలించినట్టు లీగ్‌ చైర్మన్‌ అరుణ్‌ ధూమల్‌ వివరించాడు. ఈనెల 31న జరిగే తుదిపోరుకు సంప్రదాయం ప్రకారం.. డిఫెండింగ్‌ చాంప్‌ రాయల్‌ చాలెంజర్స్‌ సొంతగడ్డ బెంగళూరు ఆతిథ్యం ఇవ్వాలి. కానీ అనూహ్యంగా బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కు బీసీసీఐ తరలించింది. ఫైనల్‌ మ్యాచ్‌ను తరలించడంపై కర్ణాటక క్రికెట్‌ సంఘం (కేఎ్‌ససీఏ) కూడా తీవ్ర అసంతృప్తి ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వం ఫైనల్‌ మ్యాచ్‌ టిక్కెట్లను భారీగా డిమాండ్‌ చేయడమే వేదిక తరలింపునకు కారణమని వార్తలొచ్చాయి. దీనిపై ధూమల్‌ స్పందిస్తూ.. ‘చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం తక్కువ. పైగా ఫైనల్‌కు ఎక్కువ సంఖ్యలో టిక్కెట్లు అందుబాటులో ఉంచాలి. ఇక, తుదిపోరు సమయంలోనే ఐసీసీ బోర్డు సమావేశం జరుగుతోంది. దాంతో భారీగా బోర్డు సభ్యులు తరలివస్తారు. ఈనేపథ్యంలో ఎక్కువ సామర్థ్యం ఉన్న వేదికలో ఫైనల్‌ నిర్వహించాల్సి వచ్చింది. అందుకే అహ్మదాబాద్‌ను ఎంపిక చేశాం’ అని తెలిపాడు.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ ఫైనల్ వేదిక మార్పుపై స్పందించిన కర్ణాటక హోం మంత్రి

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా కీలక పదవికి రాజీనామా

Updated Date - May 08 , 2026 | 02:18 AM