Share News

ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీర్‌ అనుమానాస్పద మృతి

ABN , Publish Date - Apr 01 , 2026 | 01:03 AM

ఐపీఎల్‌లో విషాదం చోటు చేసుకుంది. లీగ్‌లో మ్యాచ్‌ల బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీర్‌గా వ్యవహరిస్తోన్న ఇంగ్లండ్‌కు చెందిన 76 ఏళ్ల జాన్‌ విలియమ్‌...

ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీర్‌ అనుమానాస్పద మృతి

ముంబై: ఐపీఎల్‌లో విషాదం చోటు చేసుకుంది. లీగ్‌లో మ్యాచ్‌ల బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీర్‌గా వ్యవహరిస్తోన్న ఇంగ్లండ్‌కు చెందిన 76 ఏళ్ల జాన్‌ విలియమ్‌ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈనెల 29న మ్యాచ్‌ ముగిసిన తర్వాత హోటల్‌లోని తన గదికి చేరుకున్న జాన్‌.. ఆ తర్వాత ఎంతకూ బయటికి రాలేదు. దీంతో సిబ్బంది గది తలుపులు బద్ధలు కొట్టి చూడగా.. జాన్‌ విగతజీవిగా పడి ఉన్నాడు. ఆసుపత్రికి తరలించినా, అప్పటికే అతను మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

ఎల్డీఎఫ్ గెలుపును కోరుకుంటున్న మోదీ.. విమర్శలు గుప్పించిన రాహుల్

బీజేపీ అనాగరిక పార్టీ.. నిప్పులు చెరిగిన మమత

Updated Date - Apr 01 , 2026 | 01:03 AM