Share News

రెండ్రోజులు ఆలస్యంగా ఐపీఎల్‌

ABN , Publish Date - Feb 28 , 2026 | 02:25 AM

ఈ ఏడాది ఐపీఎల్‌ను వచ్చే నెల 28వ తేదీ నుంచి మే 31 వరకు నిర్వహించేలా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. తొలుత మార్చి 26వ తేదీన ప్రారంభించాలని అనుకున్నా తాజాగా రెండ్రోజులు...

రెండ్రోజులు ఆలస్యంగా ఐపీఎల్‌

  • మార్చి 28న ప్రారంభం

ముంబై: ఈ ఏడాది ఐపీఎల్‌ను వచ్చే నెల 28వ తేదీ నుంచి మే 31 వరకు నిర్వహించేలా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. తొలుత మార్చి 26వ తేదీన ప్రారంభించాలని అనుకున్నా తాజాగా రెండ్రోజులు ఆలస్యంగా లీగ్‌ను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఫైనల్‌ మే 31న జరుగుతుంది. అసోం, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే ఐపీఎల్‌ పూర్తి షెడ్యూల్‌ సిద్ధం కాగా, ఈ ఎన్నికల సందర్భంగా స్వల్ప మార్పుచేర్పులుంటే వాటిని సరిచేసి కొత్త తేదీలను ప్రకటించాలని ఐపీఎల్‌ పాలకమండలి ఎదురు చూస్తోంది.

ఇవి కూడా చదవండి:

వరుస డకౌట్లకు చెక్.. అభిషేక్ ఫామ్ అందుకోవడానికి కారణం అదే!

టీమిండియా కీలక పోరులో సత్తా చాటింది: సచిన్ టెండూల్కర్

Updated Date - Feb 28 , 2026 | 02:25 AM