Share News

బ్యాట్లు గర్జించాలి

ABN , Publish Date - Oct 18 , 2026 | 01:45 AM

జింబాబ్వే మహిళల జట్టుతో జరిగిన తొలి టీ20లో భారత్‌కు గెలుపు సులువుగా దక్కలేదు. టాపార్డర్‌ విఫలం కావడంతో 19 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన విషయం తెలిసిందే...

బ్యాట్లు గర్జించాలి

జింబాబ్వేతో భారత

మహిళల రెండో టీ20 నేడు

రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

రాయ్‌పూర్‌: జింబాబ్వే మహిళల జట్టుతో జరిగిన తొలి టీ20లో భారత్‌కు గెలుపు సులువుగా దక్కలేదు. టాపార్డర్‌ విఫలం కావడంతో 19 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన విషయం తెలిసిందే. పర్యాటక జట్టుకు చెందిన అనామక బౌలర్లు భారత స్టార్‌ బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేయగలిగారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే రెండో టీ20లో స్మృతి మంధాన బృందం స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చాల్సిన అవసరం ఉంది. ఊహించని విధంగా తొలి మ్యాచ్‌లో టాపార్డర్‌ విఫలమవడం ఆందోళనపరిచింది. 3.1 ఓవర్లలోనే మంధాన, అనుష్క, హర్మన్‌ప్రీత్‌, షఫాలీ పెవిలియన్‌ చేరారు. స్పిన్నర్‌ గ్వాంజుర, మవుంగ బంతులకు నిర్లక్ష్యపు షాట్లతో వికెట్లను చేజార్చుకున్నారు. మిడిలార్డర్‌లో దీప్తి శర్మ, నిక్కీ ప్రసాద్‌ ఆదుకోకపోయుంటే అవమానకర ఓటమి ఎదురయ్యేదేమో! అందుకే నేటి మ్యాచ్‌లో ఎలాంటి అవకాశం ఇవ్వకుండా బ్యాటర్లు చెలరేగాలనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

ఢిల్లీ క్యాపిటల్స్.. కుల్‌దీప్ లాంటి స్పిన్నర్ మీకు మళ్లీ దొరుకుతాడా?: ఆకాశ్ చోప్రా

యశస్వికి అన్యాయం చేశారు.. సెలెక్టర్లపై అశ్విన్ ఫైర్!

Updated Date - Oct 18 , 2026 | 01:45 AM