Share News

మనోళ్లకు భారీ ఆధిక్యం

ABN , Publish Date - Jul 12 , 2026 | 03:29 AM

క్రాంతి గౌడ్‌ (5/37) కెరీర్‌లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శనకు స్మృతీ మంధాన (69 బ్యాటింగ్‌) మరో అర్ధ శతకం తోడవడంతో ఇంగ్లండ్‌తో ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో భారత జట్టు తిరుగులేని స్థితిలో...

మనోళ్లకు భారీ ఆధిక్యం

  • మంధాన అజేయ అర్ధ శతకం

  • భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 154/1

  • క్రాంతి పాంచ్‌ పటాక

  • ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 170 ఆలౌట్‌

లండన్‌: క్రాంతి గౌడ్‌ (5/37) కెరీర్‌లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శనకు స్మృతీ మంధాన (69 బ్యాటింగ్‌) మరో అర్ధ శతకం తోడవడంతో ఇంగ్లండ్‌తో ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో భారత జట్టు తిరుగులేని స్థితిలో నిలిచింది. మంధానతోపాటు షఫాలీ (33), యాస్తికా భాటియా (39 బ్యాటింగ్‌) సత్తా చాటడంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో శనివారం ఆఖరికి వికెట్‌ నష్టానికి 154 రన్స్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 115 రన్స్‌తో కలిపి మనోళ్లు మొత్తంగా 269 పరుగుల ఆధిక్యం సాధించారు. అంతకుముందు యువ పేసర్‌ క్రాంతి గౌడ్‌ బెంబేలెత్తించడంతో ఇంగ్లండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. ఓవర్‌నైట్‌ 21/1 స్కోరుతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌..క్రాంతి ధాటికి 47/4తో నిలిచింది. ఈ దశలో అమీజోన్స్‌ (52), కెప్టెన్‌ బ్రంట్‌ (44) ఐదో వికెట్‌కు 84 పరుగులతో ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు. ఆ తర్వాత భారత బౌలర్ల ధాటికి టపాటపా వికెట్లు చేజార్చుకొన్న ఇంగ్లండ్‌ 200 స్కోరు కూడా చేయలేకపోయింది.

సంక్షిప్త స్కోర్లు

భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌: 285; ఇంగ్లండ్‌ మొదటి ఇన్నింగ్స్‌: 170 ఆలౌట్‌ (అమీజోన్స్‌ 52, బ్రంట్‌ 44, క్రాంతి గౌడ్‌ 5/37, సయాలీ సత్గరే 2/40, స్నేహ్‌ రాణా 2/41).

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 154/1 (మంధాన 69 బ్యాటింగ్‌, యాస్తిక 39 బ్యాటింగ్‌, షఫాలీ 33, ఎకిల్‌స్టోన్‌ 1/46).

ఇవీ చదవండి:

స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై రచ్చ.. ఈసీబీకి ఐసీసీ క్లీన్‌ చిట్!

ఆ ఫొటోలు చూసి కోహ్లీ షాకైపోయాడు: ఇంగ్లండ్ బ్యాటర్ జార్డన్ కాక్స్

Updated Date - Jul 12 , 2026 | 03:29 AM