Share News

ఆ ఫొటోలు చూసి కోహ్లీ షాకైపోయాడు: ఇంగ్లండ్ బ్యాటర్ జార్డన్ కాక్స్

ABN , Publish Date - Jul 11 , 2026 | 04:30 PM

కోహ్లీకి అసలు ఏమాత్రం అనుమానం రాకుండా కొందరు అతడి ఫొటోలు తీశారని ఇంగ్లండ్ బ్యాటర్ జార్డన్ కాక్స్ తెలిపాడు. ఇది కోహ్లీని షాక్‌కు గురి చేసిందని చెప్పాడు.

ఆ ఫొటోలు చూసి కోహ్లీ షాకైపోయాడు: ఇంగ్లండ్ బ్యాటర్ జార్డన్ కాక్స్
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: త్వరలో ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పాలు పంచుకోనున్నాడు. జులై 14 నుంచి బర్మింగ్‌హామ్‌లో ఈ టోర్నీ జరగనుంది. ఇదిలా ఉంటే గత నెలలో ఇంగ్లండ్‌కు వెళ్లిన కోహ్లీ లండన్‌లో స్టార్ బ్యాటర్ జార్డన్ కాక్స్‌ను కలిశాడు. ఈ సందర్భంగా తమకు ఎదురైన ఒక షాకింగ్ అనుభవాన్ని జార్డన్ తాజాగా మీడియాతో పంచుకున్నాడు. ఈ సమావేశం గురించి మీడియాకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుందామని తాము అనుకున్నట్టు జార్డన్ తెలిపాడు. కానీ తమ ప్రయత్నాలు ఫలించకపోగా ఎవరో సీక్రెట్‌గా ఫొటోలు తీయడం కోహ్లీని షాక్‌కు గురిచేసిందని చెప్పాడు.

‘కోహ్లీని ఇది చాలా షాక్‌కు గురి చేసింది. కోహ్లీని ఎవరో ఫాలో అవుతున్నట్టు అతడికి చిన్నపాటి అనుమానం కూడా రాకుండా ఫాలో అయ్యారు. అతడి పక్క నుంచి చాలా మంది వెళ్లారు. కానీ ఒక్కరు కూడా ఆగి కనీసం పలుకరించను కూడా లేదు. దీంతో, ఎవరూ తనను గమనించలేదని అనుకున్నాడు. రెండు గంటల తరువాత ఫొటోలు బయటకు వచ్చేసరికి షాక్ అయిపోయాడు. వెంటనే నాకు మెసేజ్ చేశాడు. ఈ ఫొటోలు ఎలా వచ్చాయి. వీటిని చూశావా? అని ప్రశ్నించాడు. అసలు ఈ ఫొటోలు ఎవరు తీశారో నాకూ ఏమీ అర్థం కాలేదు’ అని జార్డన్ అప్పటి ఉదంతాన్ని గుర్తు చేసుకున్నాడు.


‘జనాలు ఎల్లప్పుడూ అతణ్ణి గమనిస్తూనే ఉంటారు. కానీ జనాల దృష్టికి దూరంగా సాధారణ జీవితాన్ని ఎంజాయ్ చేయాలని అతడికీ ఉంటుంది. దురదృష్ట వశాత్తూ ప్రతిసారీ అది సాధ్యం కాదు’ అని చెప్పాడు. జార్డన్ కూడా విరాట్ కోహ్లీతో కలిసి ఆర్‌సీబీ తరఫున ఐపీఎల్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే.

2026 ఐపీఎల్ సీజన్‌లో కోహ్లీ ఆర్‌సీబీ తరఫున 600 పైచిలుకు పరుగులు స్కోర్ చేసిన విషయం తెలిసిందే. ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్‌ను కూడా సొంతం చేసుకుంది. ఆ తరువాత అఫ్గానిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు కోహ్లీ గాయం కారణంగా దూరం కావాల్సి వచ్చింది.


ఈ వార్తలనూ చదవండి:

ప్రపంచ కప్ ఫిక్సింగ్ ఆరోపణలు.. మౌనం వీడిన అర్జెంటీనా కోచ్

ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్: విక్రయానికి మ్యాచ్ టర్ఫ్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

Updated Date - Jul 11 , 2026 | 04:38 PM