కష్టాల్లో భారత్
ABN , Publish Date - Mar 08 , 2026 | 03:34 AM
ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక గులాబీ టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. రెండో రోజు శనివారం తమ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లకు 105 పరుగులు చేసింది....
రెండో ఇన్నింగ్స్ 105/6
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 323
సదర్లాండ్ శతకం
పెర్త్: ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక గులాబీ టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. రెండో రోజు శనివారం తమ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లకు 105 పరుగులు చేసింది. జెమీమా (14), హర్మన్ (11), దీప్తి (9), ఓపెనర్లు షఫాలీ (5), మంధాన (2) విఫలం కావడం దెబ్బతీసింది. పేసర్లు లూసీ హామిల్టన్‌కు మూడు, సదర్లాండ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్రస్తుతం భారత్ ఇంకా 20 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 323 పరుగులు చేసింది. అనాబెల్ సదర్లాండ్ (129) వరుసగా మూడు టెస్టుల్లో శతకం బాదిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. సయాలీకి 4.. దీప్తి, క్రాంతిలకు రెండేసి వికెట్లు దక్కాయి.
ఇవి కూడా చదవండి:
టీమిండియాలో ప్రతి ప్లేయర్ డేంజరే.. మేం చాలా జాగ్రత్తగా ఆడాలి: కివీస్ కెప్టెన్ శాంట్నర్
ఈసారైనా గెలవండి.. లేదంటే ఆ చోకర్స్ ట్యాగ్ మీకిచ్చేస్తా: కివీస్‌కు డేల్ స్టెయిన్ వార్నింగ్