Share News

అమ్మాయిలకు రెండో ఓటమి

ABN , Publish Date - Apr 20 , 2026 | 01:32 AM

దక్షిణాఫ్రికాతో రెండో టీ20లోనూ భారత మహిళలు ఓటమి పాలయ్యారు. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో సఫారీలు 8 వికెట్లతో ఘన విజయం సాధించారు...

అమ్మాయిలకు రెండో ఓటమి

డర్బన్‌: దక్షిణాఫ్రికాతో రెండో టీ20లోనూ భారత మహిళలు ఓటమి పాలయ్యారు. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో సఫారీలు 8 వికెట్లతో ఘన విజయం సాధించారు. తొలుత భారత్‌ 20 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. షఫాలీ (57), అనుష్క శర్మ (28) మినహా అంతా విఫలమయ్యారు. ట్రయన్‌, శెఖుఖునె చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం కెప్టెన్‌ వోల్వార్ట్‌ (54), సునె లుస్‌ (57) హాఫ్‌ సెంచరీలతో మెరవడంతో దక్షిణాఫ్రికా 17.1 ఓవర్లలో 148/2 స్కోరుతో లక్ష్యాన్ని ఛేదించింది. శ్రేయాంక 2 వికెట్లు పడగొట్టింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో సఫారీ జట్టు 2-0 ఆధిక్యంలో ఉంది.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: ఎట్టకేలకు.. తొలి విజయాన్ని నమోదు చేసిన కేకేఆర్

ఐపీఎల్ 2026: ఆర్ఆర్‌పై చెలరేగిన బౌలర్లు.. కేకేఆర్ టార్గెట్ 156

Updated Date - Apr 20 , 2026 | 01:32 AM