బోణీ కొట్టిన భారత్
ABN , Publish Date - May 30 , 2026 | 01:44 AM
జెమీమా రోడ్రిగ్స్ (69), యాస్తికా భాటియా (54) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా..అరంగేట్ర పేసర్ నందినీ శర్మ (3/34) మూడు వికెట్లతో...
తొలి టీ20లో ఇంగ్లండ్‌పై గెలుపు
చెమ్స్‌ఫోర్డ్ (ఇంగ్లండ్): జెమీమా రోడ్రిగ్స్ (69), యాస్తికా భాటియా (54) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా..అరంగేట్ర పేసర్ నందినీ శర్మ (3/34) మూడు వికెట్లతో అదరగొట్టడంతో టీ20 వరల్డ్ కప్ సన్నాహకాలను భారత్ ఘనంగా ఆరంభించింది. ఆతిథ్య ఇంగ్లండ్‌తో మూడు టీ20ల సిరీ్‌సలోని తొలి మ్యాచ్‌లో టీమిండియా 38రన్స్‌తో విజయం సాధించింది. తొలుత భారత్ 20 ఓవర్లలో 188/7 స్కోరు చేసింది. లారెన్ బెల్ మూడు వికెట్లు పడగొట్టింది. ఛేదనలో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 150/8 స్కోరుకే పరిమితమై ఓడింది. అమీ జోన్స్ (67), హీథర్ నైట్ (21) మాత్రమే రాణించారు. క్రాంతి గౌడ్ రెండు వికెట్లు కైవసం చేసుకుంది.
ఇవి కూడా చదవండి:
కేన్ విలియమన్స్ వరల్డ్ రికార్డ్
వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్