శ్రేయాస్ కెప్టెన్సీకి పరీక్ష
ABN , Publish Date - Jul 23 , 2026 | 02:21 AM
రెండు సిరీ్‌సలు..ఆరు టీ20 మ్యాచ్‌లు..టీమిండియాకు ఒక్కదానిలోనూ విజయం దక్కలేదు. ఈనేపథ్యంలో ముచ్చటగా మూడో పొట్టి సిరీ్‌సకు భారత్ సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీ్‌సలో భాగంగా...
సా.4.30 నుంచి
యునైట్ 8, డీడీ స్పోర్ట్స్‌లో..
జింబాబ్వేతో భారత్ తొలి టీ20 నేడు
హరారే: రెండు సిరీ్‌సలు..ఆరు టీ20 మ్యాచ్‌లు..టీమిండియాకు ఒక్కదానిలోనూ విజయం దక్కలేదు. ఈనేపథ్యంలో ముచ్చటగా మూడో పొట్టి సిరీ్‌సకు భారత్ సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీ్‌సలో భాగంగా గురువారం ఇక్కడ జింబాబ్వేతో తొలి టీ20లో శ్రేయాస్ అయ్యర్ సేన తలపడనుంది. రెండు వరుస సిరీస్ పరాజయాలతో డీలా పడిన భారత్..జింబాబ్వేతో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం. పైగా ఈ సిరీస్ కెప్టెన్ శ్రేయాస్‌కు కఠిన పరీక్ష. సారథిగా మొదటి ఏడు టీ20లలో ఆరింటిని ఓడిన అతడు జింబాబ్వేపై సిరీస్ నెగ్గడం కీలకం. ఈ సిరీ్‌సలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై మరోసారి అందరి దృష్టి నిలిచింది. కారణం..ఇదే హరారేలో ఐదు నెలల కిందట జరిగిన అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో అతడు సెంచరీ బాదడం. దాంతో అచ్చొచ్చిన గ్రౌండ్‌లో వైభవ్ మరోసారి చెలరేగుతాడేమో చూడాలి. వైభవ్‌తోపాటు హరారే మైదానం అభిషేక్‌కు కూడా మరపురానిదే. అభిషేక్ తన తొలి టీ20 శతకాన్ని ఇక్కడే సాధించాడు. అందువల్ల ఓపెనర్లిద్దరూ చెలరేగి, ఆపై మిగతా బ్యాటర్లు తమ కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వర్తిస్తే టీమిండియా భారీ స్కోరు చేయడం సులువే. వైస్ కెప్టెన్ తిలక్‌ను ఏ స్థానంలో ఆడిస్తారనేది మరో ఆసక్తికర అంశం. వాస్తవంగా టీ20లలో తిలక్‌ది మూడో నెంబర్. కానీ ఇషాన్ కిషన్‌ను ఆ స్థానంలో పంపుతుండడంతో..తిలక్‌ను ఐదో నెంబర్‌లో ఆడిస్తున్నారు. కానీ ఆ స్థానంలో తిలక్ అంత సౌకర్యంగా కనిపించడంలేదు. దాంతో తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్..తిలక్ విషయంలో ఏం చేస్తాడో చూడాలి. హర్ష్ దూబే, శివమ్ దూబే, సూర్యాన్ష్ షెగ్డేలలో..ఇద్దరికి తుది జట్టులో చోటు కల్పించడం కూడా టీమిండియాకు మరో సవాల్. మయాంక్ యాదవ్‌తోపాటు ప్రిన్స్ యాదవ్ కొత్త బంతిని పంచుకొనే చాన్సుంది. మూడో పేసర్ స్థానం కోసం అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ పోటీ పడుతున్నారు.
జట్లు (అంచనా)
భారత్: శ్రేయాస్ (కెప్టెన్), వైభవ్, అభిషేక్, ఇషాన్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్/అశోక్ శర్మ
జింబాబ్వే: సికిందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, మరుమణి (కీపర్), డియాన్ మైర్స్/వెస్లే మధెవెరె, ర్యాన్ బర్ల్, బ్రాడ్ ఇవాన్స్, మసకద్జ, మిల్టన్ శుంబా, న్యూమన్ న్యామూరీ, ఎన్‌గరావ, ముజరబానీ
Also Read:
కౌంటీ ఛాంపియన్‌షిప్: యార్క్‌షైర్‌తో కుల్‌దీప్ యాదవ్ ఒప్పందం
గిద్దలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి