‘తొలి’ సిరీస్ కోసం..
ABN , Publish Date - Jul 25 , 2026 | 02:51 AM
శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లిన టీమిండియా ఓటములను చవి చూసింది. కానీ ఆ వెంటనే జింబాబ్వేతో...
సాయంత్రం 4.30 నుంచి
యునైటెడ్ 8లో..
జోష్‌లో టీమిండియా
గెలుపే ధ్యేయంగా జింబాబ్వే
నేడు రెండో టీ20
హరారే: శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లిన టీమిండియా ఓటములను చవి చూసింది. కానీ ఆ వెంటనే జింబాబ్వేతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో మాత్రం బోణీ చేసింది. ఇక శనివారం జరిగే రెండో మ్యాచ్‌లోనూ నెగ్గి తన నాయకత్వంలో ‘తొలి’ సిరీస్‌ను అందుకోవాలని శ్రేయాస్ పట్టుదలగా ఉన్నాడు. అందుకే ఎలాంటి అలక్ష్యానికి తావీయకుండా ఈ మ్యాచ్‌తోనే భారత్ ఫలితం రాబట్టాలనుకుంటోంది. మరోవైపు ఆతిథ్య జింబాబ్వే ఈ సిరీ్‌సలో సజీవంగా ఉండాలంటే రెండో టీ20లో కచ్చితంగా గెలవాల్సిందే.
పటిష్టంగా భారత్: తొలి టీ20లో భారత జట్టు అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపించింది. ఓపెనర్ వైభవ్ తన హిట్టింగ్‌తో హాఫ్ సెంచరీ సాధించి ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకున్నాడు. ఇషాన్, కెప్టెన్ శ్రేయాస్ అలవోకగా ఆడేశారు. మరో ఓపెనర్ అభిషేక్ రెండేళ్ల క్రితం ఇదే మైదానంలో తన టీ20 ప్రయాణాన్ని ఆరంభించి ఆ సిరీ్‌సలో శతకం బాదాడు. కానీ ఇటీవలి కాలంలో అతని బ్యాట్ నుంచి పరుగులు రావడం లేదు. ఇక పేసర్ మయాంక్ తన కోటా ఓవర్లలో 18 పరుగులే ఇచ్చి 2 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ప్రిన్స్ కూడా అంచనాలకు తగ్గట్టు రాణిస్తుండగా.. కొత్త పేసర్ అశోక్ శర్మ తొలి వికెట్ కోసం ఎదురుచూస్తున్నాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.
సవాల్ విసిరేనా?: సిరీస్ ఆరంభ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయిన జింబాబ్వే జట్టు భారత్‌కు సవాల్ విసరాలంటే స్థాయికి మించిన ప్రదర్శన చేయాల్సిందే. మయాంక్ ధాటికి పవర్‌ప్లేలోనే తడబడిన జట్టు మధ్య ఓవర్లలో కాస్త నిలదొక్కుకుంది. 32/4 నుంచి 125 స్కోరు దాకా రావడం వారికి కాస్త ఊరటనిచ్చే విషయం. భారత బౌలర్ల పేస్‌ను ఆడడంలో బ్యాటర్లు కష్టపడాల్సి వచ్చింది. ఇక బౌలింగ్‌లో పేసర్ ముజరబాని ఒక్కడే ఫర్వాలేదనిపించాడు.
తుది జట్లు (అంచనా):
భారత్: అభిషేక్, వైభవ్, ఇషాన్, శ్రేయాస్ (కెప్టెన్), తిలక్, దూబే, రింకూ, బిష్ణోయ్, మయాంక్, ప్రిన్స్, అశోక్.
జింబాబ్వే: బెనెట్, కర్రాన్, మైర్స్, సికిందర్ రజా (కెప్టెన్), బర్ల్, మధెవెరె, తడివనషె, ఇవాన్స్, మసకద్జ, ఎన్‌గరవ, ముజరబాని.
ఇవి కూడా చదవండి:
కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్
కామన్వెల్త్ గేమ్స్: భారత అథ్లెట్ తులిక మాన్‌పై సస్పెన్షన్