హార్దిక్, పంత్‌కు పిలుపు?
ABN , Publish Date - Sep 16 , 2026 | 05:13 AM
వెస్టిండీ్‌సతో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం బుధవారం జాతీయ సెలెక్టర్లు భారత జట్టును ఎంపిక చేయనున్నారు. ఇందులో గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు...
విండీస్‌తో వన్డే సిరీస్‌కు జట్టు ఎంపిక నేడు
న్యూఢిల్లీ: వెస్టిండీ్‌సతో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం బుధవారం జాతీయ సెలెక్టర్లు భారత జట్టును ఎంపిక చేయనున్నారు. ఇందులో గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు పిలుపందే అవకాశం ఉంది. ప్రస్తుతం అతడిని ఆసీస్ ‘ఎ’తో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం భారత్ ‘ఎ’ జట్టుకు ఎంపిక చేశారు. అంతేకాకుండా టెస్టులకే పరిమితమైన కీపర్ రిషభ్ పంత్ కూడా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఆడే చాన్సుంది. ఈ వన్డే సిరీస్ జరిగే సమయంలోనే భారత టీ20 జట్టు ఆసియాగేమ్స్‌లో తలపడుతుంది. దీంతో ఇషాన్ కిషన్ అందుబాటులో ఉండడు కాబట్టి పంత్‌ను ఎంపిక చేయనున్నారు. ఇక జైస్వాల్, రజత్ పటీదార్ రిజర్వ్ ఆటగాళ్లుగా ఉండే అవకాశం ఉంది. అలాగే విండీ్‌సతోనే జరిగే ఐదు టీ20ల సిరీ్‌సకు ఆసియాడ్‌లో పాల్గొన్న జట్టునే కొనసాగించే అవకాశం ఉంది.
Also Read:
అక్టోబర్ 3న ‘పాన్-IIT AP సమ్మిట్ 2026’: సీఎం చంద్రబాబు
తెలంగాణలో మోస్ట్ వాంటెడ్ మహిళా మావోయిస్టు లొంగుబాటు