అక్టోబరు 6 నుంచి హైదరాబాద్ టీ20 టిక్కెట్ల విక్రయం
ABN , Publish Date - Sep 24 , 2026 | 05:52 AM
భారత్-వెస్టిండీ్‌స జట్ల మధ్య జరిగే నాలుగో టీ20 మ్యాచ్ టిక్కెట్ల విక్రయం అక్టోబరు 6 నుంచి...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): భారత్-వెస్టిండీ్‌స జట్ల మధ్య జరిగే నాలుగో టీ20 మ్యాచ్ టిక్కెట్ల విక్రయం అక్టోబరు 6 నుంచి జరుగుతుంది. వచ్చేనెల 14వ తేదీన ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కు రెండు వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా టిక్కెట్ల ఇవ్వనున్నట్టు హెచ్‌సీఏ కార్యదర్శి మన్నె జీవన్‌రెడ్డి బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. కాగా మహబూబ్ నగర్, కరీంనగర్‌లో త్వరలో క్రికెట్ అకాడమీలు తెరవనున్నామని తెలిపారు. ఇక నవంబరులో హెచ్‌సీఏ ఎన్నికలు నిర్వహించే అవకాశముందని చెప్పారు.
ఇవీ చదవండి:
ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ
ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు