Share News

సిరీస్‌ లక్ష్యంగా..

ABN , Publish Date - Aug 23 , 2026 | 05:34 AM

శ్రీలంకతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీ్‌సలో భారత్‌ క్లీన్‌స్వీ్‌పపై కన్నేసింది. ఆదివారం నుంచి ఇరు జట్ల మధ్య జరిగే చివరి మ్యాచ్‌కు కొలంబో వేదిక కానుంది. మరోవైపు ఈ విజయం భారత్‌కు...

సిరీస్‌ లక్ష్యంగా..

లంకతో భారత్‌ రెండో టెస్టు నేటి నుంచి

ఉదయం10 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో..

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీ్‌సలో భారత్‌ క్లీన్‌స్వీ్‌పపై కన్నేసింది. ఆదివారం నుంచి ఇరు జట్ల మధ్య జరిగే చివరి మ్యాచ్‌కు కొలంబో వేదిక కానుంది. మరోవైపు ఈ విజయం భారత్‌కు అత్యంత కీలకం కానుంది. ఎందుకంటే గత మూడేళ్ల నుంచి విదేశీ గడ్డపై జట్టు సిరీస్‌ సాధించలేకపోయింది. 2023, జూలైలో విండీ్‌సపై చివరిసారి భారత్‌ నెగ్గింది. ఆ తర్వాత ఆసీస్‌ చేతిలో ఓడి దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లతో సిరీ్‌సలను సమం చేసుకోగలిగింది. ఈ మధ్య కాలంలో స్వదేశంలోనూ జట్టు కివీస్‌, సఫారీల చేతుల్లో ఓడింది. ఈ పరాజయాల మధ్య లంకతో జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం గిల్‌ సేనకు కాస్త ఊరటనివ్వగలిగింది. అదే ఊపులో ఈ టెస్టును నెగ్గితే సిరీస్‌ దక్కడంతో పాటు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకే అవకాశం ఉంది. అటు ఆతిథ్య లంక సిరీ్‌సలో నిలవాలంటే వారి టాపార్డర్‌ బ్యాటింగ్‌ మెరుగవ్వాల్సి ఉంది. కొత్త ప్లేయర్‌ కమిల్‌ మిషార ఓపెనర్‌గా రానున్నాడు.

గిల్‌, జైస్వాల్‌ చెలరేగాలి: తొలి టెస్టులో భారత కెప్టెన్‌ గిల్‌తో పాటు ఓపెనర్‌ జైస్వాల్‌ విఫలమయ్యాడు. గిల్‌ గత 6 ఇన్నింగ్స్‌లో 2 శతకాలు బాది ఫామ్‌లో ఉన్నా, లెఫ్టామ్‌ స్పిన్‌ను ఆడడంలో తడబడుతున్నాడు. కెప్టెన్‌గా 10 టెస్టుల్లో 73 సగటుతో 1100 రన్స్‌ చేసిన అతను లయ అందుకోవడం కష్టం కాకపోవచ్చు. బౌలింగ్‌ విభాగంలో స్పిన్నర్‌ కుల్దీప్‌ స్థానం సందేహంలో పడింది. గాలెలో పిచ్‌ సహకరించినా ఒక్క వికెట్‌ మాత్రమే తీయడం ఇబ్బందిగా మారింది. తన స్థానంలో ఆఫ్‌ స్పిన్నర్‌ సారాంశ్‌ జైన్‌ను ఆడించే అవకాశం ఉంది.

తుది జట్లు (అంచనా):

భారత్‌: రాహుల్‌, జైస్వాల్‌, దేవ్‌దత్‌, గిల్‌ (కెప్టెన్‌), పంత్‌, జురెల్‌, జడేజా, మానవ్‌, కుల్దీ్‌ప/సారాంశ్‌, సిరాజ్‌, ప్రసిద్ధ్‌.

శ్రీలంక: కమిల్‌, ఉడార, పసిందు, కమిందు, ధనంజయ (కెప్టెన్‌), సోనాల్‌, డిక్‌వెల్లా, కేశర, ప్రభాత్‌, లాహిరు కుమార, అసిత.

ఇవి కూడా చదవండి

ఆ అవమానకర వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ

డీఎస్సీపై జగన్‌కు మరోసారి సవాల్ విసిరిన మంత్రి లోకేశ్

Updated Date - Aug 23 , 2026 | 05:34 AM