Share News

వచ్చే 5న పాక్‌తో టీమిండియా ఢీ

ABN , Publish Date - Aug 07 , 2026 | 04:24 AM

మహిళల ఆసియా కప్‌ షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్‌ మండలి (ఏసీసీ) గురువారం విడుదల చేసింది. దుబాయ్‌ వేదికగా ఎనిమిది జట్ల ఈ టోర్నీ...

వచ్చే 5న పాక్‌తో టీమిండియా ఢీ

మహిళల ఆసియా కప్‌ షెడ్యూల్‌ విడుదల

దుబాయ్‌: మహిళల ఆసియా కప్‌ షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్‌ మండలి (ఏసీసీ) గురువారం విడుదల చేసింది. దుబాయ్‌ వేదికగా ఎనిమిది జట్ల ఈ టోర్నీ ఈ నెల 28 నుంచి టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. గ్రూప్‌-ఎలో భారత్‌తోపాటు పాకిస్థాన్‌, థాయ్‌లాండ్‌, హాంకాంగ్‌ జట్లు.. గ్రూప్‌-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్‌, యూఏఈ, ఇండోనేసియా ఉన్నాయి. చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మ్యాచ్‌ని సెప్టెంబరు 5న షెడ్యూల్‌ చేశారు. గ్రూప్‌లో టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీ్‌సకు అర్హత సాధిస్తాయి. వచ్చే నెల 13న ఫైనల్‌ జరుగుతుంది. ఈ నెల 30న థాయ్‌లాండ్‌తో తొలి మ్యాచ్‌ ఆడనున్న భారత్‌.. వచ్చేనెల మూడున హాంకాంగ్‌తో తలపడనుంది.

ఇవి కూడా చదవండి:

సీనియర్ ఆటగాళ్లను గౌరవించాలి.. గంభీర్‌కు పరోక్షంగా సందేశం ఇచ్చిన రహానే

ప్రీతి జింటాతో డేటింగ్ రూమర్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన బ్రెట్ లీ

Updated Date - Aug 07 , 2026 | 04:24 AM