Share News

బ్యాటర్లదే భారం

ABN , Publish Date - Nov 15 , 2026 | 04:51 AM

న్యూజిలాండ్‌తో సిరీస్‌ నిర్ణాయక చివరి వన్డేకు వేళైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఆదివారం జరిగే ఆఖరి...

బ్యాటర్లదే భారం

ఉ. 7.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో..

నేడు కివీస్‌తో భారత్‌ చివరి వన్డే

మౌంట్‌ మాంగనుయ్‌: న్యూజిలాండ్‌తో సిరీస్‌ నిర్ణాయక చివరి వన్డేకు వేళైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఆదివారం జరిగే ఆఖరి వన్డేలో కివీస్‌ను ఎదుర్కోనుంది. అయితే బ్యాటర్ల ఘోర వైఫల్యంతో నాలుగో మ్యాచ్‌లో 244 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైన భారత్‌..సిరీస్‌స దక్కించుకోవాలంటే ఆఖరి పోరులో అదిరే ప్రదర్శన చేయాల్సిందే. ముఖ్యంగా రయ్‌..మంటూ దూసుకొచ్చే బంతులను మన బ్యాటర్లు సమర్థంగా అడ్డుకొంటేనే ఫలితం లభిస్తుంది. ఈ సిరీస్‌లో రోహిత్‌ శర్మ ఇప్పటివరకు తనదైన ముద్ర వేయలేదు. ఈనేపథ్యంలో ఆఖరి మ్యాచ్‌లో అతడు తన బ్యాటింగ్‌ మెరుపులు ప్రదర్శించాలని అభిమానులు ఆశిస్తున్నారు. రోహిత్‌తో పాటు విరాట్‌కూ న్యూజిలాండ్‌ గడ్డపై ఇదే ఆఖరి సిరీస్‌. అందువల్ల వారిద్దరు భారీ ఇన్నింగ్స్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తారేమో చూడాలి. మరోవైపు నాలుగో వన్డేలో అద్భుత విజయం సాధించిన కివీస్‌ అదే జోరును చివరి మ్యాచ్‌లో కొనసాగించాలని భావిస్తోంది. తద్వారా సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలగా ఉంది.

ఈ వార్తలనూ చదవండి:

జెన్సన్ హువాంగ్ రీఎంట్రీకి ప్రయత్నాలు.. మద్దతుగా మస్క్

ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో కమ్యూనికేషన్ సమస్య.. అమెరికాలో విమాన సేవల నిలిపివేత..

Updated Date - Nov 15 , 2026 | 04:51 AM