Share News

చరిత్రలో తొలిసారి..

ABN , Publish Date - Sep 22 , 2026 | 05:50 AM

భారత్‌-జపాన్‌ దేశాల మధ్య 75 ఏళ్ల దౌత్యపరమైన సంబంధాలకు గుర్తుగా మంగళవారం చరితాత్మ్రక టీ20 మ్యాచ్‌ జరుగనుంది. ప్రస్తుతం టీమిండియా...

చరిత్రలో తొలిసారి..

ఉదయం 9.30 నుంచి

స్టార్‌ స్పోర్ట్స్‌లో..

జపాన్‌తో భారత్‌ ఏకైక టీ20 నేడు

మ్యాచ్‌కు టైఫూన్‌ ముప్పు

సనో (జపాన్‌): భారత్‌-జపాన్‌ దేశాల మధ్య 75 ఏళ్ల దౌత్యపరమైన సంబంధాలకు గుర్తుగా మంగళవారం చరితాత్మ్రక టీ20 మ్యాచ్‌ జరుగనుంది. ప్రస్తుతం టీమిండియా ఆసియాగేమ్స్‌లో ఆడేందుకు జపాన్‌లోనే ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ మాత్రం ఆసియాడ్‌లో భాగం కాదు. అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియాతో 41వ ర్యాంక్‌లో ఉన్న జపాన్‌ ఏ విషయంలోనూ సరితూగకపోయినా.. వరల్డ్‌ చాంపియన్‌తో ఆడనుండడం ఆ జట్టుకు చక్కటి అనుభవం కానుంది. అయితే జపాన్‌ ఆశ తీరాలంటే వాతావరణం సహకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఈ మ్యాచ్‌కు టైఫూన్‌ డుజాన్‌ నుంచి ముప్పు పొంచి ఉంది. ఈ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. స్టేడియం ఉన్న కాంటో ప్రాంతంలో ఇప్పటికే వర్షం కురుస్తోంది. అయితే మంగళవారం ఉదయానికి పరిస్థితులు మెరుగయ్యే అవకాశాలు లేకపోలేదని స్థానిక అధికారులు భావిస్తున్నారు. అదే జరిగితే ఈ చరిత్రాత్మక మ్యాచ్‌కు అడ్డంకి తొలగినట్టే. మరోవైపు క్రికెట్‌కు ఆదరణ లేని జపాన్‌లో ఈ క్రీడను అర్థం చేసుకునేందుకు పూర్తి వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు.

ఇవి కూడా చదవండి:

ఆసియా గేమ్స్: కుమారుడి టీమ్ ఓటమి.. మాధవన్ రియాక్షన్ ఇదే!

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. రిజర్వ్ ఓపెనర్ రేసులో సాయి సుదర్శన్

Updated Date - Sep 22 , 2026 | 05:50 AM