ఒత్తిడిలో టీమిండియా
ABN , Publish Date - Jul 11 , 2026 | 03:31 AM
గతంలో ఎన్నడూ లేని రీతిలో టీ20 వరల్డ్ చాంపియన్ టీమిండియా తీవ్ర ఒత్తిడిలో ఉంది. పసికూన ఐర్లాండ్ చేతిలో వైట్‌వా్‌షకు గురైనట్టుగానే ఇప్పుడు ఇంగ్లండ్ చేతిలోనూ...
రాత్రి 7 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌లో
క్లీన్‌స్వీ్‌పపై ఇంగ్లండ్ దృష్టి ఫనేడు ఐదో టీ20
సౌథాంప్టన్: గతంలో ఎన్నడూ లేని రీతిలో టీ20 వరల్డ్ చాంపియన్ టీమిండియా తీవ్ర ఒత్తిడిలో ఉంది. పసికూన ఐర్లాండ్ చేతిలో వైట్‌వా్‌షకు గురైనట్టుగానే ఇప్పుడు ఇంగ్లండ్ చేతిలోనూ అలాంటి పరాభవానికి దగ్గరలో ఉంది. ఇరు జట్ల మధ్య ఆఖరిదైన ఐదో టీ20 శనివారం జరుగనుంది. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ ఆతిథ్య జట్టు చేతిలో శ్రేయాస్ సేనకు ఓటములే ఎదురయ్యాయి. దీంతో 0-3తో భారత్ సిరీ్‌సను కోల్పోయిన విషయం తెలిసిందే. ఇలా వరుసగా రెండు సిరీ్‌సలు కోల్పోవడం 2019 తర్వాత ఇదే తొలిసారి. ఇక మరో వైట్‌వాష్‌ను తప్పించుకోవాలంటే భారత్ తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో చెలరేగాల్సిందే.
పోటీ ఇస్తారా?: పొట్టి ఫార్మాట్‌లో వరల్డ్ టాప్-2 బ్యాటర్లు భారత జట్టులోనే ఉన్నారు. అయినా వరుస పరాజయాలు జట్టును ఇబ్బందిపెడుతున్నాయి. స్లో వికెట్‌పై అదనపు బౌన్స్ బంతులను ఎదుర్కోవడంలో బ్యాటర్లు తడబాటుకు లోనవుతున్నారు. జట్టుకు టీ20 వరల్డ్‌కప్ అందించిన శాంసన్‌ను పక్కనబెట్టి వైభవ్‌కు చోటిస్తే అతను మూడు మ్యాచ్‌ల్లోనూ నిరాశపర్చాడు. అభిషేక్, ఇషాన్, తిలక్, దూబే సైతం ఆకట్టుకోవడం లేదు. కెప్టెన్ శ్రేయాస్ మాత్రమే ఫర్వాలేదనిపిస్తున్నాడు. దీంతో శాంసన్‌ను నేటి మ్యాచ్‌లో ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్‌లో ఫ్లాట్ ట్రాక్‌లపై చెలరేగిన బ్యాటర్లకు ఇక్కడి పిచ్‌లు అసలైన సవాల్ విసురుతున్నాయి. అటు బౌలర్లు కూడా జట్టు విజయంలో భాగం కాలేకపోతున్నారు. ఏదిఏమైనా ఆఖరాటలోనైనా తమ లోపాలను సరిదిద్దుకుని బరిలోకి దిగితేనే ఫలితం దక్కుతుంది.
తుది జట్లు (అంచనా)
భారత్: అభిషేక్, వైభవ్, ఇషాన్/శాంసన్, శ్రేయాస్ (కెప్టెన్), తిలక్, దూబే, సుందర్/సూర్యాంశ్, అక్షర్, ప్రిన్స్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్.
ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, బట్లర్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), బెథెల్, బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, రెహాన్, ఆర్చర్, రషీద్, టంగ్.
ఇవి కూడా చదవండి:
లార్డ్స్‌లో తొలి టెస్టు: స్మృతి మంధాన అరుదైన ఘనత
భారత్‌తో ఏకైక టెస్టు: టాస్ నెగ్గిన ఇంగ్లండ్ మహిళా జట్టు