Share News

బోణీ కొడతారా?

ABN , Publish Date - Jul 09 , 2026 | 02:47 AM

జట్టు ఎంపికలో డైలమా.. పరిస్థితులకు అనుగుణంగా ఆటతీరు మార్చుకోవడంలో వైఫల్యం.. వెరసి ఇంగ్లండ్‌ పర్యటనలో భారత జట్టు ఇంకా గెలుపు బోణీ కొట్టలేకపోయింది....

బోణీ కొడతారా?

ఇంగ్లండ్‌తో భారత్‌ నాలుగో టీ20 నేడు

తిలక్‌ స్థానంలో సంజూ!

రాత్రి 10 నుంచి

బ్రిస్టల్‌: జట్టు ఎంపికలో డైలమా.. పరిస్థితులకు అనుగుణంగా ఆటతీరు మార్చుకోవడంలో వైఫల్యం.. వెరసి ఇంగ్లండ్‌ పర్యటనలో భారత జట్టు ఇంకా గెలుపు బోణీ కొట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తుతుండగా, ఆత్మవిశ్వాసం కోల్పోయిన టీమిండియా ఇంగ్లండ్‌తో గురువారం జరిగే నాలుగో టీ20కి సిద్ధమైంది. పసికూన ఐర్లాండ్‌తో ఎలాగూ టీ20 సిరీస్‌ పోయింది. దీంతో ఇంగ్లండ్‌తో పొట్టి సిరీ్‌సను కనీసం డ్రా చేయాలంటే నాలుగో మ్యాచ్‌లో గెలవడం తప్ప భారత్‌కు మరో దారిలేదు. ఇక..సంజూ శాంసన్‌ను కాదని 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీకి చోటిచ్చారు. అయితే జట్టులో మిగతా బ్యాటర్లతో పోలిస్తే వైభవ్‌ మెరుగ్గా ఆడలేదు. అలాగని మరీ చెత్త ప్రదర్శన కూడా చేయలేదు. సిరీస్‌లో 0-2తో వెనుకంజలో ఉండడంతో సంజూకు తిరిగి జట్టులో స్థానం కల్పించే విషయాన్ని కోచ్‌ గంభీర్‌ కొట్టిపారేయకపోవడం గమనార్హం. ఒకవేళ సంజూని తీసుకోదలిస్తే వైస్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మను తప్పిస్తారేమో చూడాలి. ఫినిషర్‌గా పేరు తెచుకొన్న శివమ్‌ దూబేను కాదని హర్షిత్‌ రాణాను ముందు పంపడం కూడా తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఈక్రమంలో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రక్షాళన చేసే అవకాశాలున్నాయి. బౌలింగ్‌ విభాగం..మరీ ముఖ్యంగా స్పిన్నర్లు ప్రభావం చూపకపోవడం జట్టును దెబ్బ తీస్తోంది. మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ పూర్తిగా తేలిపోయాడు. ఏమైనా..బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాలలో తిరుగులే కుండా ఉన్న ఇంగ్లండ్‌ను అడ్డుకోవాలంటే టీమిండియా శక్తికి మించి సత్తా చాటాల్సిందే. బ్రిస్టల్‌ గ్రౌండ్‌ పిచ్‌పై టీ20లలో అత్యధిక స్కోర్లు నమోదవుతాయి. కాగా.. ఈ గ్రౌండ్‌లో పూర్తిగా సాగిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి ఉండడం టీమిండియాకు సానుకూలాంశం.

ఇవి కూడా చదవండి:

ఐసీసీ ఎన్నికల్లో పెను సంచలనం.. డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజాకు షాక్!

అక్తర్ రికార్డును బ్రేక్ చేస్తాను.. టీమిండియా బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Jul 09 , 2026 | 02:47 AM