Share News

బిష్ణోయ్‌పై వేటు?

ABN , Publish Date - Jul 07 , 2026 | 03:19 AM

ఐర్లాండ్‌తో సిరీస్‌ కోల్పోయింది. పోనీ ఇంగ్లండ్‌తో టీ20లలోనైనా సత్తా చాటుతుందనుకుంటే.. రెండో మ్యాచ్‌ను చేజార్చుకుంది. దాంతో తీవ్ర విమర్శలతో ఒత్తిడిలో పడిన టీమిండియా...

బిష్ణోయ్‌పై  వేటు?

ఇంగ్లండ్‌తో భారత్‌ మూడో టీ20 నేడు

రాత్రి 10 నుంచి సోనీస్పోర్ట్స్‌లో

నాటింగ్‌హామ్‌: ఐర్లాండ్‌తో సిరీస్‌ కోల్పోయింది. పోనీ ఇంగ్లండ్‌తో టీ20లలోనైనా సత్తా చాటుతుందనుకుంటే.. రెండో మ్యాచ్‌ను చేజార్చుకుంది. దాంతో తీవ్ర విమర్శలతో ఒత్తిడిలో పడిన టీమిండియా ఇంగ్లండ్‌తో మంగళవారం ఇక్కడ జరిగే మూడో టీ20కి సిద్ధమైంది. తొలి విజయంకోసం అర్రులు చాస్తున్న భారత్‌ ఈ మ్యాచ్‌కు లెగ్‌స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ను తప్పించడం దాదాపు ఖాయమైంది. రెండో మ్యాచ్‌ 17వ ఓవర్లో బిష్ణోయ్‌ ఏకంగా 29 పరుగులిచ్చుకోవడంతో..మ్యాచ్‌ టీమిండియా చేజారిన సంగతి తెలిసిందే. మొత్తంగా రెండో టీ20లో నాలుగు ఓవర్లు వేసిన బిష్ణోయ్‌ 60 పరుగులిచ్చినా ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. ఈనేపథ్యంలో రవికి బదులు పేసర్‌ ప్రిన్స్‌ యాదవ్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. మూడో వన్డే డే/నైట్‌లో జరగనుండగా..ఫ్లాట్‌గా ఉండే నాటింగ్‌హామ్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు స్వర్గధామం. దాంతో వైభవ్‌ సూర్యవంశీ బ్యాటునుంచి ధారాళంగా పరుగులను ఆశించవచ్చు. అలాగే ఇతర భారత బ్యాటర్లు కూడా భారీ స్కోర్లు సాధించాల్సి ఉంటుంది. పేసర్‌ అర్ష్‌దీప్‌ వికెట్లు తీస్తున్నా ఎక్కువగా పరుగులిస్తున్నాడు. స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఆశించిన మేర రాణించలేకపోతున్నాడు. ఏమైనా మూడో మ్యాచ్‌లో నెగ్గాలంటే భారత్‌ సమష్టి ప్రదర్శన చేయాల్సిందే. మరోవైపు రెండో టీ20 గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఆతిథ్య ఇంగ్లండ్‌ ఈ మ్యాచ్‌ బరిలో దిగుతోంది.

ఇవి కూడా చదవండి:

వైభవ్ అరంగేట్రంలో జాప్యంపై స్పందించిన బీసీసీఐ

ట్రంప్‌ జోక్యంపై యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘం తీవ్ర విమర్శలు

Updated Date - Jul 07 , 2026 | 03:19 AM