భారత్‌తో ఓ టెస్టు, మూడు వన్డేలు
ABN , Publish Date - Mar 03 , 2026 | 03:09 AM
అఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్టు ఓ టెస్టు, మూడు వన్డేల కోసం భారత్‌లో పర్యటించనుంది. జూన్ 6 నుంచి 10 వరకు జరిగే ఏకైక టెస్టుకు న్యూ చండీగఢ్ తొలిసారి ఆతిథ్యం ఇవ్వనుంది....
జూన్ 6 నుంచి అఫ్ఘాన్ జట్టు పర్యటన
న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్టు ఓ టెస్టు, మూడు వన్డేల కోసం భారత్‌లో పర్యటించనుంది. జూన్ 6 నుంచి 10 వరకు జరిగే ఏకైక టెస్టుకు న్యూ చండీగఢ్ తొలిసారి ఆతిథ్యం ఇవ్వనుంది. దేశంలో ఇది 31వ టెస్టు వేదిక కానుంది. ఇక్కడి మహరాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో ఇప్పటిదాకా ఐపీఎల్ మ్యాచ్‌లతో పాటు ఓ అంతర్జాతీయ టీ20, మహిళల వన్డేలు మాత్రమే జరిగాయి. ఇక జూన్ 14 నుంచి 20 వరకు ధర్మశాల, లఖ్‌నవూ, చెన్నైల్లో వన్డేలు జరుగుతాయి. 2018లో ఇరు జట్ల మధ్య బెంగళూరులో చివరి టెస్టు జరిగింది.
ఇవి కూడా చదవండి:
విండీస్‌పై విజయం.. ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఎవరంటే?
అతడి హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైంది.. సంజుపై సూర్య ప్రశంసలు