Share News

బుమ్రా, నితీశ్‌ ఫిట్‌

ABN , Publish Date - Sep 11 , 2026 | 05:37 AM

గాయాల నుంచి కీలక ఆటగాళ్లు కోలుకోవడంతో అఫ్ఘానిస్థాన్‌తో జరిగే మూడు టీ20ల సిరీ్‌సలో భారత్‌ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి...

బుమ్రా, నితీశ్‌  ఫిట్‌

అఫ్ఘాన్‌తో టీ20 సిరీస్‌

బెంగళూరు: గాయాల నుంచి కీలక ఆటగాళ్లు కోలుకోవడంతో అఫ్ఘానిస్థాన్‌తో జరిగే మూడు టీ20ల సిరీ్‌సలో భారత్‌ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగబోతోంది. ఈనెల 13 నుంచి జరిగే ఈ సిరీస్‌ కోసం ఇదివరకు స్పిన్‌ ఆల్‌రౌండర్‌ సుందర్‌ ఫిట్‌నె్‌సను నిరూపించుకోగా.. తాజాగా పేసర్‌ బుమ్రా, పేస్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ కూడా పూర్తిగా కోలుకున్నట్టు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ (సీఓఈ) మెడికల్‌ టీమ్‌ ప్రకటించింది. శుక్రవారం వీరు జట్టుతో చేరనున్నారు. ఇక మరో పేసర్‌ హర్షిత్‌ రాణా మాత్రం కోలుకోకపోవడంతో సిరీ్‌సకు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో యష్‌ ఠాకూర్‌ను ఎంపిక చేశారు.

ఆసియాడ్‌ జట్టులో ప్రతికా రావల్‌

న్యూఢిలీ: ఆసియా క్రీడల భారత జట్టులో టాపార్డర్‌ బ్యాటర్‌ ప్రతికా రావల్‌కు చోటు దక్కింది. ‘ద హండ్రెడ్‌’ టోర్నీ సందర్భంగా గాయపడిన జెమీమా రోడ్రిగ్స్‌ కోలుకోకపోవడంతో ఆమె స్థానంలో రావల్‌కు స్థానం కల్పించారు.

ఈ వార్తలు కూడా చదవండి

కనీస వేతనాలు చెల్లించడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి వివేక్

ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ

Updated Date - Sep 11 , 2026 | 05:37 AM