Share News

యష్‌వర్ధన్‌ శతకం

ABN , Publish Date - Sep 22 , 2026 | 05:14 AM

యష్‌వర్ధన్‌ చౌహాన్‌ (122) శతకంతో చెలరేగడంతో భారత అండర్‌-19 జట్టు.. ఆస్ట్రేలియా అండర్‌-19 జట్టుపై వరుసగా....

యష్‌వర్ధన్‌ శతకం

  • భారత కుర్రాళ్లదే సిరీస్‌

  • రెండో వన్డేలో ఆసీస్‌ ఓటమి

రాజ్‌కోట్‌: యష్‌వర్ధన్‌ చౌహాన్‌ (122) శతకంతో చెలరేగడంతో భారత అండర్‌-19 జట్టు.. ఆస్ట్రేలియా అండర్‌-19 జట్టుపై వరుసగా రెండో విజయం సాధించింది. దీంతో మరో వన్డే మిగిలుండగానే ఈ మూడు మ్యాచ్‌ల సిరీ్‌సను భారత్‌ 2-0తో దక్కించుకుంది. సోమవారం జరిగిన ఈ రెండో వన్డేలో భారత బ్యాటర్లు చెలరేగడంతో 102 పరుగుల భారీ తేడాతో ఆసీస్‌ చిత్తుగా ఓడింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 341/7 పరుగులు సాధించింది. వినీత్‌ (87), ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ (47) రాణించారు. ఛేదనలో ఆసీస్‌ 41.1 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌటైంది. క్రోస్నెక్‌ (81)రాణించాడు. చిగురుపాటి వెంకటకు మూడు.. పరేష్‌, యష్‌వర్ధన్‌కు రెండేసి వికెట్లు లభించాయి.

ఈ వార్తలనూ చదవండి:

అంతరిక్ష రంగంలో చైనా మరో అద్భుతం.. కేవలం 2 రోజుల్లో..

హౌతీలపై దాడికి అమెరికా రెడీ.. చివరి నిమిషంలో ట్రంప్ యూటర్న్..

Updated Date - Sep 22 , 2026 | 05:34 AM