ఆధిక్యంలో భారత కుర్రవాళ్లు
ABN , Publish Date - Oct 07 , 2026 | 02:53 AM
ఆస్ట్రేలియా అండర్-19తో జరుగుతున్న రెండో అనధికార టెస్టులో అభిప్రయ్ బిశ్వాస్ (73), యష్‌వర్ధన్ చౌహాన్ (52) హాఫ్ సెంచరీలతో...
తొలి ఇన్నింగ్స్ 315
అహ్మదాబాద్: ఆస్ట్రేలియా అండర్-19తో జరుగుతున్న రెండో అనధికార టెస్టులో అభిప్రయ్ బిశ్వాస్ (73), యష్‌వర్ధన్ చౌహాన్ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో మంగళవారం రెండో రోజు భారత అండర్ 19 జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 315 పరుగులు చేసింది. స్పెన్సర్ గ్రీన్‌కు ఏడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఆట ముగిసే సమయానికి ఆసీస్ కుర్రాళ్లు రెండో ఇన్నింగ్స్‌లో 86/4 స్కోరు చేశారు. క్రీజులో హాలిక్ (12 బ్యాటింగ్), కాటిల్ (11 బ్యాటింగ్) ఉన్నారు. తన్మయ్ బలోడా మరోసారి చెలరేగి నాలుగు వికెట్లు తీశాడు. ప్రస్తుతం భారత్ 55 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన