శాంసన్‌కు ఉద్వాసన
ABN , Publish Date - Jul 07 , 2026 | 05:46 AM
ఓపెనర్ సంజూ శాంసన్‌పై వేటు పడింది. జింబాబ్వేతో ఈనెల 23 నుంచి జరిగే మూడు టీ20ల సిరీస్ కోసం సెలెక్టర్లు భారత జట్టును సోమవారం ప్రకటించారు. ఇందులో,,,
అశోక్, యష్‌లకు చోటు
మయాంక్‌కు పిలుపు
జింబాబ్వేతో టీ20 సిరీ్‌సకు భారత జట్టు
న్యూఢిల్లీ: ఓపెనర్ సంజూ శాంసన్‌పై వేటు పడింది. జింబాబ్వేతో ఈనెల 23 నుంచి జరిగే మూడు టీ20ల సిరీస్ కోసం సెలెక్టర్లు భారత జట్టును సోమవారం ప్రకటించారు. ఇందులో సంజూ శాంసన్‌పై కఠిన నిర్ణయం తీసుకున్నారు. టీ20 వరల్డ్‌క్‌పలో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన అతను ఇటీవల వరుసగా విఫలమవుతున్నాడు. దీంతో అతడి స్థానంలో రింకూ సింగ్‌కు చోటు కల్పించారు. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తన స్థానాన్ని కాపాడుకున్నాడు. సంజూతో పాటు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో జట్టుతో పాటే ఉన్న అక్షర్, సుందర్, బిష్ణోయ్, హర్షిత్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్‌లను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ ఫార్మాట్‌లో తొలిసారిగా పేసర్లు అశోక్ శర్మ, యష్ ఠాకూర్, స్పిన్నర్ హర్ష్ దూబేలకు బెర్త్ దక్కింది. అలాగే మరో పేసర్ మయాంక్ యాదవ్ 2024 తర్వాత జట్టులోకి వచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో అతను ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయకపోయినా సెలెక్టర్లు అతడిపై నమ్మకముంచారు. రిజర్వ్ కీపర్‌గా ప్రభ్‌సిమ్రన్ ఉండనున్నాడు. మరోవైపు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోసం గాయపడిన నితీశ్ స్థానంలో శివమ్ దూబేకు చోటు కల్పించారు.
జట్టు: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్, ఇషాన్, అభిషేక్, తిలక్, దూబే, సూర్యాన్ష్, రింకూ, హర్ష్ దూబే, వరుణ్, ప్రిన్స్ యాదవ్, యష్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్, ప్రభ్‌సిమ్రన్.
ఇవి కూడా చదవండి:
వైభవ్ అరంగేట్రంలో జాప్యంపై స్పందించిన బీసీసీఐ
ట్రంప్ జోక్యంపై యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘం తీవ్ర విమర్శలు