సమరానికి సై
ABN , Publish Date - Oct 18 , 2026 | 05:13 AM
ఆసియా క్రీడలు ముగిశాయి.. ఇప్పుడు పారా ఆసియా క్రీడలు వచ్చేశాయి. గత ఆసియాడ్ అద్భుత ప్రదర్శన ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో భారత జట్టు నగోయా పారా ఆసియాడ్కు...
168 మందితో బరిలో భారత్
నేటినుంచి పారా ఆసియా క్రీడలు
నగోయ: ఆసియా క్రీడలు ముగిశాయి.. ఇప్పుడు పారా ఆసియా క్రీడలు వచ్చేశాయి. గత ఆసియాడ్ అద్భుత ప్రదర్శన ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో భారత జట్టు నగోయా పారా ఆసియాడ్కు సిద్ధమైంది. ఆదివారం మొదలయ్యే ఈ ఆసియాడ్లో 168 మందితో కూడిన భారత పారా అథ్లెట్ల బృందం అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. హాంగ్జౌ (2023) పారా ఆసియా క్రీడల్లో మనోళ్లు రికార్డు స్థాయిలో 111 పతకాలు సొంతం చేసుకున్నారు. 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్యాలతో పతకాల పట్టికలో ఐదో స్థానంతో భళా అనిపించారు. ఈసారి నగోయలో 11 క్రీడాంశాల్లో భారత్ పోటీపడుతోంది. క్రీడలు అధికారికంగా ఆదివారం మొదలు కానున్నా.. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, అంధుల ఫుట్బాల్ పోటీలలో భారత్ శనివారంనాడే బరిలోకి దిగింది. పారాలింపిక్ చాంపియన్, జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ పసిడి పతక రేసులో ముందు వరుసలో నిలిచాడు. హైజంపర్ నిషద్ కుమార్, మహిళల 100, 200 మీటర్ల రేసులో తలపడుతున్న ప్రీతీ పాల్, క్లబ్ త్రోయర్ ధరమ్వీర్సింగ్లను కూడా స్వర్ణ పతక ఫేవరెట్లుగా అంచనా వేస్తున్నారు. ఆర్చరీ, బ్యాడ్మింటన్లో మనకు అత్యధిక పతకాలు లభించే చాన్సుంది. చేతులు లేకున్నా కాళ్లతోనే బాణాలు సంధించే శీతల్దేవి, పాయల్ నాగ్, పారాలింపిక్ చాంపియన్ హర్విందర్ సింగ్, టోమన్ కుమార్ ఆర్చరీలో స్వర్ణాలపై గురిపెట్టారు. ఇక గత ఆసియాడ్ బ్యాడ్మింటన్లో భారత్ 4 స్వర్ణ, 4 రజత, 13 కాంస్య పతకాలను మన షట్లర్లు గెలిచారు. గత ప్రదర్శనను పునరావృతం చేయాలన్న పట్టుదలతో షట్లర్లు ఉన్నారు. పారాలింపిక్ విజేత అవనీ లేఖార షూటింగ్ జట్టుకు నేతృత్వం వహిస్తోంది. భవీనా పటేల్ టీటీ పతక రేసులో బలంగా నిలిచింది. ఇక..షట్లర్ ప్రమోద్ భగత్, స్ర్పింటర్ సిమ్రన్ శర్మ ప్రారంభోత్సవంలో భారత పతాకధారులుగా వ్యవహరిస్తారు.
బ్యాడ్మింటన్లో పతకం ఖరారు
పారా ఆసియా క్రీడల్లో భారత్కు తొలి పతకం ఖాయమైంది. బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్ ఎస్ఎల్3-ఎ్సయూ5 విభాగంలో మానసి జోషి/తులసీమతి జోడీ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. తద్వారా ఈ జోడీకి కనీసం కాంస్య పతకం లభించనుంది. ఇక, సెమీ్సలో ఓడినా మానసి జోడీకి పతకం దక్కనుంది.
ఇవి కూడా చదవండి:
ఢిల్లీ క్యాపిటల్స్.. కుల్దీప్ లాంటి స్పిన్నర్ మీకు మళ్లీ దొరుకుతాడా?: ఆకాశ్ చోప్రా
యశస్వికి అన్యాయం చేశారు.. సెలెక్టర్లపై అశ్విన్ ఫైర్!