స్పిన్‌పైనే బ్యాటర్ల దృష్టి
ABN , Publish Date - Aug 07 , 2026 | 04:29 AM
స్పిన్ బౌలింగ్‌ను ఆడడంలో టీమిండియా ఆటగాళ్లకు తిరుగులేదని గతంలో పేరుండేది. కానీ ఇటీవలి కాలంలో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు...
నెట్స్‌లో చెమటోడ్చిన భారత్
నేటి నుంచి శ్రీలంక ఎలెవన్‌తో వామప్
కొలంబో: స్పిన్ బౌలింగ్‌ను ఆడడంలో టీమిండియా ఆటగాళ్లకు తిరుగులేదని గతంలో పేరుండేది. కానీ ఇటీవలి కాలంలో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలతో జరిగిన టెస్టు సిరీ్‌సల్లోనూ అదే రుజువైంది. నాణ్యమైన స్పిన్నర్లను సరిగా ఆడలేక వికెట్లు చేజార్చుకోవడం భారత జట్టుకు ఇబ్బందికరంగా మారింది. ఈనేపథ్యంలో ఈనెల 15 నుంచి శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీ్‌సపై అందరి దృష్టీ నెలకొంది. ఎందుకంటే లంక జట్టులోనూ సమర్థులతో కూడిన స్పిన్ దళం ఉంది. సిరీస్ జరిగేది వారి సొంత గడ్డపై కావడంతో భారత్‌కు మరింత ప్రమాదకరం కానుంది. అందుకే నేటి ఉదయం 10 గంటల నుంచి శ్రీలంక ఎలెవన్‌తో జరిగే మూడు రోజుల వామప్ మ్యాచ్ భారత బ్యాటర్లకు కీలకం కానుంది. కెప్టెన్ గిల్, రాహుల్, జైస్వాల్‌లతో పాటు ఇతర బ్యాటర్లు కూడా స్వదేశంలో స్పిన్ బౌలింగ్‌ను ప్రాక్టీస్ చేసినా.. అది లంక పిచ్‌లపై ఆడే అనుభవానికి ప్రత్యామ్నాయం కాబోదు. నేటి వామప్ అక్కడి పరిస్థితులపై అవగాహన కల్పిస్తుందని చెప్పవచ్చు. వాస్తవానికి భారత జట్టులో చాలామంది ఆటగాళ్లకు శ్రీలంకలో రెడ్ బాల్ క్రికెట్ ఆడడం తొలిసారి. రాహుల్, కుల్దీప్, జడేజా మాత్రమే చివరిసారి (2017) ఇక్కడ పర్యటించిన జట్టులో ఉన్నారు. బుమ్రా లేకపోవడంతో పేసర్ సిరాజ్ కీలకం కానున్నాడు. బ్రార్, సారాంశ్ గత నెలలో భారత్ ‘ఎ’ తరఫున లంకలో ఆడారు. మరోవైపు సోనాల్ దినుష నేతృత్వంలో భారత్‌తో జరిగే వామప్ మ్యాచ్ కోసం శ్రీలంక ఎలెవన్ జట్టును ప్రకటించారు. పేసర్లు లాహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, స్పిన్నర్ రమేశ్ మెండిస్ కీలకం కానున్నారు.
పిచ్‌పై భారత్ అసంతృప్తి
కొలంబోలోని నాండెస్ర్కిప్ట్స్ క్రికెట్ క్లబ్ (ఎన్‌సీసీ) మైదానంలో జరిగే వామప్ మ్యాచ్ పిచ్‌పై భారత జట్టు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ‘వికెట్‌పై గడ్డి ఎక్కువగా ఉందని భారత జట్టు చెబుతోంది. కానీ ఇది మూడు రోజుల మ్యాచ్ కాబట్టి మేం అలాగే ఉంచుతాం. అలాగే శ్రీలంక బోర్డు కూడా పిచ్‌పై కొద్దిగా గడ్డి ఉండాలని కోరింది. వాస్తవానికి ఎన్‌సీసీ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. రెండు, మూడో రోజు నుంచి స్పిన్నర్లు లాభపడవచ్చు’ అని ఎన్‌సీసీ అధికారి ఫ్రాంకీ తెలిపాడు.
నెట్స్‌లో గిల్‌కు గాయం
ప్రాక్టీస్ సెషన్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండుసార్లు గాయపడ్డాడు. మొదట బ్యాటింగ్ చేస్తుండగా కుడి బొటనవేలికి, ఆ తర్వాత స్లిప్ క్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా చేతికి గాయమైంది. అయితే ఈ రెండుసార్లు కూడా వైద్య సహాయం తీసుకుని ప్రాక్టీస్ కొనసాగించాడు. మరోవైపు గిల్ గాయం తీవ్రతపై బీసీసీఐ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
సవాల్‌కు సిద్ధం: గంభీర్
శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీ్‌సలో ఎదురయ్యే సవాళ్లకు భారత జట్టు సిద్ధంగా ఉందని కోచ్ గౌతం గంభీర్ తెలిపాడు. గురువారం ప్రాక్టీస్ సెషన్‌కు ముందు అతడు ఆటగాళ్లతో సంభాషించాడు. ‘మనం దేనికోసం ఆడుతున్నామో, మన ముందు ఎలాంటి లక్ష్యం ఉందో అందరికీ తెలుసు. బ్యాటింగ్, బౌలింగ్ ఏదైనా సరే ఆగస్టు 15 నుంచి ఎదురయ్యే ప్రతీ సవాల్‌కు జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి. అలాగే జట్టులో నబీ, సారాంశ్, కొత్త ఫీల్డింగ్ కోచ్ శుభదీ్‌పలకు స్వాగతం పలుకుతున్నాను’ అని గంభీర్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
సీనియర్ ఆటగాళ్లను గౌరవించాలి.. గంభీర్‌కు పరోక్షంగా సందేశం ఇచ్చిన రహానే
ప్రీతి జింటాతో డేటింగ్ రూమర్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన బ్రెట్ లీ