Share News

‘ఈడెన్‌’లో పరుగుల పండుగే!

ABN , Publish Date - Feb 28 , 2026 | 02:37 AM

వరల్డ్‌ కప్‌ సూపర్‌-8 ఆఖరి పోరులో ఆదివారం వెస్టిండీ్‌సతో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుంది. టీమిండియాకు ఈ మ్యాచ్‌ నాకౌట్‌. గెలిస్తే సెమీ్‌సకు లేదంటే డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంటికే. అయితే ఈ మ్యాచ్‌లో...

‘ఈడెన్‌’లో పరుగుల పండుగే!

కోల్‌కతా : వరల్డ్‌ కప్‌ సూపర్‌-8 ఆఖరి పోరులో ఆదివారం వెస్టిండీ్‌సతో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుంది. టీమిండియాకు ఈ మ్యాచ్‌ నాకౌట్‌. గెలిస్తే సెమీ్‌సకు లేదంటే డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంటికే. అయితే ఈ మ్యాచ్‌లో పరుగుల వరద ఖాయమని స్థానిక క్యూరేటర్‌ సుజన్‌ ముఖర్జీ సూచనప్రాయంగా వెల్లడించాడు. కారణం..గత నెల తొమ్మిదిన ఈడెన్‌గార్డెన్స్‌లో స్కాట్లాండ్‌-ఇటలీ మధ్య నిర్వహించిన మ్యాచ్‌ పిచ్‌పైనే భారత్‌-వెస్టిండీ్‌స పోరు జరగడం. ఆ పోటీలో స్కాట్లాండ్‌ తొలుత 200 పరుగులకుపైగా స్కోరు చేసింది. ఇక..బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ శుక్రవారం సాయంత్రం ఆ వికెట్‌ను పరిశీలించి చీఫ్‌ క్యూరేటర్‌ ఆశిష్‌ భౌమిక్‌తో కలిసి సుదీర్ఘంగా చర్చించాడు. వికెట్‌ ఉపరితలం బాగా పొడిగా ఉండనున్న క్రమంలో స్పిన్నర్లు కీలక భూమిక పోషించే చాన్సుంది. పిచ్‌పై బౌన్స్‌ కూడా అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇటలీతో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ పేసర్‌ ఆర్చర్‌ వికెట్‌ నుంచి అందిన బౌన్స్‌ను చక్కగా ఉపయోగించుకున్నాడు. దాంతో టీమిండియా పేస్‌ దళపతి బుమ్రా, ఎడమ చేతి వాటం బౌలర్‌ అర్ష్‌దీప్‌, హార్దిక్‌ బౌన్స్‌తో లబ్ది పొందే అవకాశాలున్నాయి. అయితే ఈసారి మెగా టోర్నీలో ఈడెన్‌లో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడుతోంది. మరోవైపు వెస్టిండీస్‌ ఇక్కడ రెండు గ్రూపు మ్యాచ్‌లు ఆడి ఉండడం ఆ జట్టుకు సానుకూలాంశం. స్కాట్లాండ్‌, ఇటలీలతో జరిగిన ఆ రెండు మ్యాచ్‌ల్లో కరీబియన్లు విజయం సాధించారు.

ఈ వార్తలూ చదవండి

ఏఐ వల్లే 4 వేల మందిని తీసేస్తున్నాము: జాక్ డోర్సీ

కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ

Updated Date - Feb 28 , 2026 | 02:37 AM