‘మిడిల్’ మెరవాలి!
ABN , Publish Date - Sep 10 , 2026 | 05:10 AM
మిడిలార్డర్ తడబాటుతో ఇబ్బందులు పడుతున్న భారత్‌కు మహిళల టీ20 ఆసియాక్‌పలో తొలిసారి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది...
రాత్రి 8 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో
భారత్-బంగ్లా సెమీఫైనల్ నేడు
మహిళల ఆసియా కప్
దుబాయ్: మిడిలార్డర్ తడబాటుతో ఇబ్బందులు పడుతున్న భారత్‌కు మహిళల టీ20 ఆసియాక్‌పలో తొలిసారి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. గురువారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌తో ఏడుసార్లు చాంప్ భారత్ తలపడనుంది. ఇరుదేశాల మధ్య రాజకీయ ఉద్రికత్తలు పెరిగిన నేపథ్యంలో ఈ మ్యాచ్ ప్రత్యేకత సంతరించుకొంది. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన బలంగా కనిపిస్తున్నా.. నిలకడలేని బ్యాటింగ్ జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై మనోళ్లు చేతులెత్తేస్తున్నారు. స్మృతి మంధాన, షఫాలీ వర్మ టచ్‌లో ఉన్నా.. వన్‌డౌన్ బ్యాటర్ ప్రతికా రావల్ ఆశించిన రీతిలో ఆడలేక పోతోంది. హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్ ఇప్పటి వరకు తమ హిట్టింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించలేదు. అయితే, బౌలింగ్ విభాగంలో వైవిధ్యం భారత్‌కు ప్రయోజనంగా మారింది. మరోవైపు బంగ్లా బ్యాటింగ్ విభాగం కూడా మెరుగైన ప్రదర్శన చేయలేక పోతోంది. యూఏఈపై కష్టంగా గెలిచి సెమీ్‌సకు చేరుకొంది. 55/6తో పీకల్లోతు కష్టాల్లో పడిన తరుణంలో కెప్టెన్ నిగర్ సుల్తానా, షర్మిన్ అక్తర్ జట్టును ఆదుకొన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఫేవరెట్‌గా భావిస్తున్నా.. సంక్లిష్టమైన పిచ్‌పై బంగ్లాను ఏమాత్రం తేలిగ్గా తీసుకొనే అవకాశం లేదు.
ఇవి కూడా చదవండి..
ఎస్-400, ఎస్‌యు-57, బ్రహ్మోస్‌పై భారత్ ఫోకస్.. మోదీ-పుతిన్ భేటీలో కీలక చర్చలు..
మరో పదేళ్లలో మనుషుల్ని ఏఐ చంపేయొచ్చు.. ఆంత్రోపిక్ పరిశోధకుడి సంచలన హెచ్చరిక..