ఆరో స్థానానికి టీమిండియా
ABN , Publish Date - May 21 , 2026 | 01:28 AM
పాకిస్థాన్‌తో రెండు టెస్టుల సిరీ్‌సను బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్ చేయడం టీమిండియాపై ప్రభావం చూపింది. డబ్ల్యూటీసీ (వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్) పట్టికలో...
డబ్ల్యూటీసీ పట్టికలో బంగ్లా పైపైకి
దుబాయ్: పాకిస్థాన్‌తో రెండు టెస్టుల సిరీ్‌సను బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్ చేయడం టీమిండియాపై ప్రభావం చూపింది. డబ్ల్యూటీసీ (వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్) పట్టికలో ఇప్పటిదాకా ఐదోస్థానంలో కొనసాగిన టీమిండియా.. ఇప్పుడు ఓ స్థానం కోల్పోయి ఆరుకు పడిపోయింది. భారత్‌ను దాటి బంగ్లాదేశ్ 5 స్థానానికి చేరుకుంది. తాజా
డబ్ల్యూటీసీ సీజన్‌లో తొమ్మిది టెస్టులాడిన భారత్.. 4 విజయాలు, 4 ఓటములు, ఓ డ్రాతో 48.15 శాతం పాయింట్లతో ఉంది. నాలుగు టెస్టులకు గాను బంగ్లా 2 విజయాలు, ఓ ఓటమి, డ్రాతో 58.33 శాతం పాయింట్లతో పైకి ఎగబాకింది. పట్టికలో ఆస్ట్రేలియా (87.50 శాతం) టాప్‌లో ఉండగా.. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక 2, 3, 4 స్థానాల్లో నిలిచాయి. ఇంగ్లండ్, పాకిస్థాన్, వెస్టిండీస్ వరుసగా 7, 8, 9 స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
భారత టీ20 జట్టుకు శ్రేయస్ కెప్టెన్ అవుతాడు: రికీ పాంటింగ్
లార్డ్స్ మైదానంలో తొలి టీ20 ప్రపంచ కప్ గెలుస్తాం: జెమీమా