3 రోజుల్లోనే..
ABN , Publish Date - Jun 09 , 2026 | 03:19 AM
బ్యాటర్లకు మించి స్పిన్నర్లు అద్వితీయ ప్రదర్శన కనబర్చడంతో భారత్ తమ టెస్టు చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. లెఫ్టామ్ స్పిన్నర్ మానవ్ సుథార్ (6/33).. ఆ తర్వాత...
నేటి నుంచి ఆస్ట్రేలియా ఓపెన్
బరిలో సింధు, ప్రణయ్, ఆయుష్
ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ 300 రన్స్‌తో
భారత్ భారీ విజయం
ఫాలోఆన్‌లో అఫ్ఘాన్ 112కే ఆలౌట్
మానవ్‌కు ఆరు, సుందర్‌కు నాలుగు వికెట్లు
ముల్లన్‌పూర్: బ్యాటర్లకు మించి స్పిన్నర్లు అద్వితీయ ప్రదర్శన కనబర్చడంతో భారత్ తమ టెస్టు చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. లెఫ్టామ్ స్పిన్నర్ మానవ్ సుథార్ (6/33).. ఆ తర్వాత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ (4/36), కుల్దీప్ (3/30)ల ప్రతిభతో అఫ్ఘానిస్థాన్‌తో ఏకైక టెస్టును భారత్ కేవలం మూడు రోజుల్లోనే ముగించింది. అంతేకాదు.. ఏకంగా ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తుగా ఓడించింది. అఫ్ఘాన్ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే పరిమితమైంది. రహ్మత్ షా (60) మాత్రమే ఆకట్టుకున్నాడు. ప్రసిద్ధ్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత 412 పరుగుల భారీ లోటుతో ఫాలోఆన్ ఆడిన అఫ్ఘాన్ జట్టు సుందర్, కుల్దీ్‌పల ధాటికి మరింత కుదేలైంది. 35.5 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ సెడిఖుల్లా అటల్ (42), గుర్బాజ్ (24) ఫర్వాలేదనిపించారు. సిరాజ్, మానవ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. మొత్తం ఏడు వికెట్లతో మానవ్ సుథార్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
స్పిన్నర్లను ఎదుర్కోలేక..: ఓవర్‌నైట్ స్కోరు 113/5తో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన అఫ్ఘాన్ తొలి సెషన్‌లో మరో 39 పరుగులే చేసి మిగిలిన వికెట్లను కోల్పోయింది. రహ్మత్ షా అర్ధసెంచరీ పూర్తి చేసి.. భారత్‌పై ఈ ఫీట్ సాధించిన తొలి అఫ్ఘాన్ క్రికెటర్‌గా నిలిచాడు. అటు మానవ్ మాత్రం చకచకా మరో మూడు వికెట్లు తీసి అరంగేట్రంలోనే 5+ వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఆ తర్వాత ఫాలోఆన్ కోసం బరిలోకి దిగిన అఫ్ఘాన్ మరింత ఇబ్బందిపడింది. రెండో సెషన్ పూర్తయ్యే సరికి 98/5 స్కోరుతో భారీ ఓటమి ముంగిట నిలిచింది. అయితే ఓపెనర్లు అటల్, మాలిక్ (8) ఓపిగ్గా క్రీజులో నిలిచి బౌలర్లను విసిగించారు. కానీ 14వ ఓవర్‌లో పేసర్ సిరాజ్ ఈ జోడీని విడదీయడంతో తొలి వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత గుర్బాజ్ బంతికో పరుగుతో కాస్త పోరాడి రెండో వికెట్‌కు 32 పరుగులు జోడించాడు. ఇక అతను నిష్క్రమించాక అటు సుందర్, ఇటు కుల్దీప్ మాయ చేయడంతో 38 పరుగులకే మిగిలిన వికెట్లన్నీ నేలకూలాయి. తొలి ఇన్నింగ్స్ సమయంలో కాలి గాయంతో బాధపడిన స్పిన్నర్ అష్రాఫ్ ఫాలోఆన్‌లో బ్యాటింగ్‌కు దిగలేదు.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 564/8 డిక్లేర్;
అఫ్ఘానిస్థాన్ తొలి ఇన్నింగ్స్: అబ్దుల్ మాలిక్ (సి) సిరాజ్ (బి) మానవ్ 16, అటల్ (బి) ప్రసిద్ధ్ 17, గుర్బాజ్ (సి) సాయి (బి) మానవ్ 12, రహ్మత్ షా (బి) మానవ్ 60, షాహిదీ (ఎల్బీ) ప్రసిద్ధ్ 20, జజాయ్ (సి అండ్ బి) మానవ్ 3, ఒమర్జాయ్ (బి) ప్రసిద్ధ్ 0, అష్రాఫ్ (సి) పంత్ (బి) మానవ్ 11, ఖరోటే (నాటౌట్) 4, సలీమ్ (ఎల్బీ) మానవ్ 0, షరీఫి (సి) పంత్ (బి) సుందర్ 6; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 58.4 ఓవర్లలో 152 ఆలౌట్; వికెట్ల పతనం: 1-28, 2-40, 3-62, 4-98, 5-113, 6-118, 7-142, 8-143, 9-143, 10-152; బౌలింగ్: సిరాజ్ 9-2-29-0, ప్రసిద్ధ్ 11-2-37-3, మానవ్ 22-10-33-6, కుల్దీప్ 10-1-32-0, వాషింగ్టన్ సుందర్ 6.4-1-21-1.
అఫ్ఘానిస్థాన్ రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్): అటల్ (సి) ప్రసిద్ధ్ (బి) సుందర్ 42, అబ్దుల్ మాలిక్ (ఎల్బీ) సిరాజ్ 8, గుర్బాజ్ (సి) ప్రసిద్ధ్ (బి) కుల్దీప్ 24, రహ్మత్ షా (సి) మానవ్ (బి) సుందర్ 13, షాహిదీ (సి) గిల్ (బి) సుందర్ 5, జజాయ్ (ఎల్బీ) మానవ్ 8, ఒమర్జాయ్ (సి) కుల్దీప్ (బి) సుందర్ 4, ఖరోటే (సి) మానవ్ (బి) కుల్దీప్ 6, షరీఫి (నాటౌట్) 0, సలీమ్ (సి) సాయి (బి) కుల్దీప్ 0, అష్రాఫ్ (ఆబ్సెంట్ హర్ట్) 0; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 35.5 ఓవర్లలో 112 ఆలౌట్; వికెట్ల పతనం: 1-42, 2-74, 3-87, 4-93, 5-98, 6-106, 7-106, 8-112, 9-112; బౌలింగ్: మానవ్ 10-2-29-1, ప్రసిద్ధ్ 3-0-6-0, కుల్దీప్ 7.5-1-30-3, సిరాజ్ 4-1-11-1, సుందర్ 11-4-36-4.
1
టెస్టు క్రికెట్ చరిత్రలో భారత జట్టుకిదే అతి పెద్ద విజయం (ఇన్నింగ్స్ 300రన్స్)
ఇవి కూడా చదవండి:
అరంగేట్రంలోనే మానవ్ సుతార్ అరుదైన ఘనత
అఫ్గాన్ బ్యాటర్ వింత ఔట్.. అసలేమిటీ ఆబ్సెంట్ హర్ట్?